వైసీపీ విమర్శకు నరం లేదా.?

Ambati Rambabu Comments on Kommineni Srinivasa Rao Arrest

నరం లేని నాలుక ఎటుకావాల్సి వస్తే అటు తిరుగుతుంది అన్న సామెత మాదిరి వైసీపీ విమర్శలకు కూడా నరం ఉండదు అనేలా సమయాన్ని, సందర్భాన్ని బట్టి వారికి ఎటు అనుకూలంగా ఉంటే అటు మాట్లాడుతున్నారు.

ఒకసారి బాబు తన సొంత సామజిక వర్గమైన కమ్మ కులానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తారని, వారి తప్పులను కూడా కాపు కాస్తారని ప్రచారం చేస్తూ చివరికి రాష్ట్ర రాజధాని అమరావతి పై కూడా కమ్మ ముద్ర వేశారు వైసీపీ నేతలు.

ADVERTISEMENT

అయితే ఇప్పుడు అదే రాజధాని అమరావతి పై దుర్భాషలాడిన సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు నేపథ్యంలో ఆ ఉన్మాదులకు వైసీపీ ఎలా మద్దతు పలకాలో అర్ధం కాకా మళ్ళీ కుల రాజకీయాలను తెరమీదకు తెచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.

కొమ్మినేని ‘కమ్మ’ అయ్యి తనను విమర్శిస్తున్నాడని బాబు కక్ష.! అంటూ వైసీపీ నేత అంబటి తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అలాగే గతంలో వల్లభనేని వంశీ విషయంలో కూడా జగన్ ఇదే తరహా విమర్శలు చేస్తూ వంశీ బాబు సొంత సామాజికవర్గమైనప్పటికీ బాబు కంటే అందగాడు కాబట్టి వంశీని అరెస్టు చేసి జైలుకు పంపించాహారంటూ అక్కడ కూడా కులం కార్డు వాడింది వైసీపీ.

దీనితో అసలు వైసీపీ సమాజానికి ఎం చెప్పాలనుకుంటుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిన్నటికి నిన్న పార్టీ అధినేత వైస్ జగన్ గంజాయి ముఠాలకు, రౌడీ షీటర్లకు మద్దతుగా ఓదార్పు యాత్రలు, పరామర్శ పర్యటనలు చేస్తూ సమాజంలో అశాంతికి అండగా, అలజడికి మద్దతుగా ప్రకటనలు చేసారు.

నేడు పార్టీ ముఖ్య నేతగా ఉన్న అంబటి రాజధాని పై విషం చిమ్ముతూ, ఆ ప్రాంత మహిళలను అగౌరవపరుస్తూ సాక్షి మీడియాలో జరిగిన దిగజారుడు చర్చకు మద్దతుగా, ఆ వ్యాఖ్యలు చేసిన ఉన్మాదులకు అండగా ఉంటూ, కొమ్మినేని అరెస్టు పై పరోక్షంగా ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ కుల రాజకీయాలకు తెరలేపుతున్నారు మాజీ మంత్రి.

దీనితో వైసీపీ రాజకీయ విలువలు ఏ స్థాయికి దిగజారుతున్నాయో అనేదానికి ఇటువంటి చర్యలే ప్రత్యక్ష ఉదాహరణలు. పార్టీ అధికారంలో లేకుంటేనే సాక్షి ఈ విధంగా రెచ్చిపోతుంటే, వైసీపీ నేతలు వాటికీ మద్దతుగా తగ్గేదెలా అంటూ పెట్రేగిపోతుంటే ఇక రానున్న కాలంలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే అన్న ఊహే రాష్ట్ర ఉనికిని ప్రశ్నించక మానదు.

ADVERTISEMENT
Latest Stories