గంటకో ట్వీట్… హడావుడి ఏంటి అంబటి..!

Ambati-Rambabu

రాజమండ్రి కేంద్రంగా టీడీపీ – జనసేన ఉమ్మడి కార్యచరణకు రూపకల్పన చేసిన ఇరుపార్టీల అధిష్టానాలు “వైసీపీ విముక్త ఆంద్రప్రదేశ్” లక్ష్యంగా ముందుకెళతాం అంటూ లోకేష్, పవన్ తమ ఆలోచనలను పంచుకున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఎవరితో కలావాలో,ఏ కార్యక్రమాలు రూపొందించుకోవాలో కూడా అధికార వైసీపీ పార్టీ అనుమతితోనే జరగాలి అన్నట్లు మంత్రి అంబటి గారి విమర్శలు నిలుస్తాయి.

ADVERTISEMENT

మొన్నటి దాక చంద్రబాబు పల్లకిని మోసిన పవన్ ఇప్పుడు తాజాగా లోకేష్ పల్లకి మోయడానికి సిద్ధపడ్డాడు అంటూ వైసీపీ ఆవు పాఠం మొదలుపెట్టారు. అందుకే పవన్ ను ప్యాకేజి స్టార్ అంటారు, చంద్రబాబు సొంత కుమారుడు, అద్దె కుమారుడు..ఇద్దరు ఉత్తమ కుమారులే అంటూ సామజిక మాద్యమంలో విమర్శలతో హడావుడి చేస్తుంటారు అంబటి.

తన మంత్రిత్వ శాఖ పని తీరు పట్ల ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేని అంబటి ప్రతిపక్ష నేతల కార్యక్రమాల మీటింగ్స్ పై రివ్యూ లు పెట్టడం మాత్రం వదులుకోరు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే ఏమో మాకు మాత్రం ఎం తెలుసు అంటూ పత్రిక విలేకరుల పైన తన మాటల దాడిని కొనసాగించడం, కృష్ణా నది జలాల వాటా పై రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వమంటే ఇంకా ఆ విషయం పై తమ పార్టీకే స్పష్టత లేదన్నట్టు మాట దాటేయడం అంబటి నైజం.

ఇవన్నీ పరిశీలిస్తున్న ప్రజలు మాత్రం ఇంతకీ జగన్ అంబటికి ఇచ్చిన మంత్రి పదవి సోషల్ మీడియాలో విపక్ష నేతల పై విమర్శలు చేయడానికా,లేక రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికా? గంటకో ట్వీట్ తో సోషల్ మీడియాలో మీ హడావుడి ఏమిటి మంత్రి గారు! అంటూ అటు టీడీపీ శ్రేణులు ఇటు జనసేన నేతలు అంబటి అదే వేదికగా కౌంటర్లు వేస్తున్నారు.

టీడీపీ – జనసేన నేతలను దగ్గర చేయడానికి వైసీపీ అధినేత జగన్ మొదలుకుని అంబటి వరకు తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తూ వస్తున్నారు.వైసీపీ నేతలు ఇరు పార్టీల నేతలను ఎంతలా విమర్శిస్తే వారికి కౌంటర్లు వేయడానికి అంతలా దగ్గరవుతున్నారు టీడీపీ – జనసేన అభిమానులు. మంత్రి గారు ఇక్కడ కేటాయించే గంట సమయాన్ని తమ శాఖ మీద ద్రుష్టి పెడితే కనీసం ఎంతోకంత ఆ శాఖకు న్యాయం చేసిన వారవుతారంటూ ఇరు పార్టీల నేతలు సలహా ఇస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories