ఓ జాతీయ చానల్ ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగడంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ వైదొలగాలని తాము కోరుకోలేదని, వాళ్లే వెళ్లిపోవాలనుకున్నారని చెప్పారు. అలాంటప్పుడు ఎవరు ఆపగలరని వ్యాఖ్యానించారు.
నిజమే ఎన్డీయే నుండి వైదొలగాలి అనే నిర్ణయం తీసుకున్నది టీడీపీనే. అయితే ఆ నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించింది బీజేపీ కేంద్రప్రభుత్వమే కదా రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేస్తూ చంద్రబాబుకు ప్రధాని అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానిస్తూ. కేంద్ర కేబినెట్ నుండి టీడీపీ మంత్రులను ఉపసంహరించాకా కూడా టీడీపీ తో మాట్లాడే ప్రయత్నం కూడా చెయ్యలేదుగా.
మరోవైపు తెలుగుదేశం వీడినంత మాత్రాన నష్టమేమీ లేదని, తమ కూటమికి 30 పార్టీలు అండగా ఉన్నాయని ఆయన చెప్పారు. అలాంటప్పుడు తామెందుకు బాధపడాలని అమిత్‌షా వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ తెగతెంపులు బీజేపీ దక్షిణాది ఆశలపై నీళ్లు చల్లాయని భావిస్తున్నారా అని అమిత్‌షాను అడగ్గా.. మేము దక్షిణాదిలో ఇప్పటికీ బలంగానే ఉన్నామని అమిత్‌షా వ్యాఖ్యానించడం విశేషం.



