వైసీపీ ఎమ్మెల్సీ లా భాగోతం….వాళ్ళు రాక, వీళ్ళు వచ్చి..!

ananta-babu-duvvada-srinivas-ys-jagan

జగన్ మోహన్ రెడ్డి తో కలిపి వైసీపీ జెండాతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యే లు అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తూ ప్రజా తీర్పుని అవమానిస్తున్నారు అనే అపవాదును మోస్తూ ప్రజలలో మరింత పలుచన అవుతున్నారు.

ADVERTISEMENT

అయితే ప్రజా తీర్పుతో కాకుండా అధినేత మెప్పుతో వచ్చే ఎమ్మెల్సీ పదవులు అందుకున్న వైసీపీ నేతలు శాసనమండలికి వచ్చి తమ పార్టీ గళం వినిపిస్తున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే లు సభకు హాజరు కాకుండా వైసీపీ పరువు తీస్తుంటే ఈ ఎమ్మెల్సీలు సభకు రావడం మూలానా వైసీపీ ప్రతిష్ట దెబ్బ తింటుంది.

పెద్దల సభగా పిలవబడే ఈ శాసన మండలిలో ఎన్నుకోబడిన నాయకులను బట్టి ఆ పార్టీ సిద్ధాంతం ఏమిటి, ఆ పార్టీ అధినేత రాజకీయ విలువలు ఏ పాటివో చెప్పొచ్చు. వైసీపీ ఎమ్మెల్సీ లుగా జగన్ మెప్పు పొంది చట్ట సభలో అడుగు పెట్టిన అనంతబాబు తన డ్రైవర్ గా పని చేసే ఒక సాధారణ దళిత వ్యక్తిని హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసిన ప్రబుద్దుడు.

ఈ కేసులో నేరాన్ని అంగీకరించి, జైల్లో శిక్ష అనుభవించి, న్యాయస్థానంలో బెయిలు సంపాధించిన అనంతబాబు ని పార్టీ పదవి నుండి కూడా తప్పించకుండా ఆయనను పెద్దల సభకు పంపించి హత్యా రాజకీయాలు ప్రోత్సహించే అధినేతగా పేరుగడించారు జగన్.

అలాగే 6 పదుల వయస్సులో అక్రమ సంబంధాలు పెట్టుకుని, భార్య పిల్లలను రోడ్డుకీడ్చి, సొంత కుటుంబ సభ్యుల పైనే బూతులతో రెచ్చిపోయి, రాడ్లతో దాడికి యత్నించిన దువ్వాడ శ్రీనివాస్ లాంటి వ్యక్తులను దగ్గరుండి ప్రోత్సహిస్తూ పక్క వారి పై బురద జల్లుతూ కుటుంబ విలువలకు జగన్ ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో సమాజానికి చాటి చెప్పారు.

హత్యలు చేసినోళ్లు ఒకపక్కన, భార్య పిల్లలను రోడ్డుకీడ్చినవాళ్లను మరొపక్కన పార్టీ తరుపున శాసన మండలికి పంపుతూ మూడు పెళ్లిళ్లు, నలుగురు భార్యలు అంటూ ప్రత్యర్థి పార్టీల నేతలను వేలెత్తి చూపుతూ జగన్ వైసీపీ పార్టీ పరువు ను, తన ప్రతిష్టను సమాజం ముందు దిగజార్చుకుంటున్నారు.

ఒక కుటుంబ పెద్దను హత్య చేసి ఆ కుటుంబంలోని మహిళను ఒంటరిని చేసి వారి పిల్లలను అనాధలుగా మార్చిన నేరస్తుడు ఒకరైతే, కుటుంబ పెద్దగా బాధ్యత వహించాల్సిన వాడే కుటుంబ సభ్యులను అగౌరవపరుస్తూ ఒక మహిళ కోసం మరో ముగ్గురు మహిళల జీవితాలను బజారుకు లాగిన శ్రీ రామ చంద్రుడు మరొకరు.

ఇటువంటి వాళ్ళు చట్ట సభలకు వచ్చి మహిళల మీద అన్యాయాలు జరిగిపోతున్నాయి …ప్రభుత్వాలు ఎం చేస్తున్నాయి….అధికారులు ఎక్కడికి వెళ్లిపోయారు అంటూ మరో మహిళను నిలదీస్తూ శుద్ధ పూస కబుర్లు చెపుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు, నేరస్తులు చట్టాలను బోధిస్తున్నట్టుగా ఉంది అంటూ ప్రజలు బాహాటంగానే వైసీపీ తీరుని జగన్ వ్యవహారశైలిని విమర్శిస్తున్నారు.

వాళ్ళను సభలకు రానివ్వకుండా…వీళ్ళను సభలకు వెళ్ళనిస్తూ చేచేతుల జగన్ తన పార్టీ పరువును తానే గంగలో కలుపుతూ విలువలు లేని పార్టీగా విశ్వసనీయత ఎరుగని అధినేతగా ప్రజలలో నవ్వులపాలవుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories