ఈ తరం రాజకీయ నాయకులకు అసెంబ్లీ అంటే ఒక కురుక్షేత్రం లా కనిపిస్తుంది. అయితే రాజుల కాలంలో ఆయుధాలతో చేసే యుద్ధం ఇప్పుడు మాటలతో కొనసాగిస్తున్నారు. ఎంతో మంది తల పండిన రాజకీయనాయకులు వారి ముందు తరం వారికి ఆదర్శంగా నిలిచి రాజకీయాల పట్ల సాధారణ ప్రజలకు సైతం అవగాహన పెంచారు. కానీ నేటి తరం రాజకీయ క్రీడలు చూస్తే సాధారణ ప్రజానీకం రాజకీయాలలోకి రావాలి అనే ఆలోచన పక్కన పెడితే రాజకీయ నాయకుల ప్రసంగాలను చూడడానికి సైతం ఆసక్తి చేపడం లేదు.
గత అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష నేత అయినా నారా చంద్రబాబు నాయుడికి జరిగినా అవమానంతో టీడీపీ నాయకులు ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవచ్చునని అని అందరూ భావించారు . అయితే అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రజల సమస్యలును అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి బలంగా వినిపించాలని వారి సభ్యులను ఆదేశించారు. అసెంబ్లీ లో వ్యవహరించ వలసిన వ్యూహాలను, ప్రభుత్యం వేసే ఎత్తుగడలకు ప్రతిపక్షం ధీటుగా సమాధానం చెప్పే విధంగా చంద్రబాబు టిడిపి నాయకులకు దిశా నిర్ధేశం చేశారు.
ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలను మాటలతో ఖైదు చేసే పనిలో సిద్ధహస్తులను ముందు వరుసలో ఉంచి ప్రజా సమస్యలను వెనుకకు నెట్టే ప్రయత్నంలో బిజీగా ఉంటుంది. అయితే రాష్ట్రం ఇప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నది. ప్రభుత్యం రష్యా – యుక్రెయిన్ యుద్ధ ప్రభావంతో పెరిగి పోయిన వంట నూనెలు, పెంపుకు సిద్ధమైన గ్యాస్ బండ ధరల నియంత్రణలో ఎటువంటి చర్యలను తీసుకుంటుందో ప్రజలకు వివరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
సినిమా టికెట్ ధరల నియంత్రణలో కనపరచిన శ్రద్ధ ప్రభుత్యం ఈ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల మీద పెడుతుందో లేదో అని యావత్ ఏపీ ప్రజానీకం ఆశక్తిగా గమనిస్తున్నారు. రోడ్లు – రవాణ వ్యవస్థని పటిష్ట పరచి ప్రజా జీవనానికి అవసరమైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్యానిదే. అలాగే ప్రభుత్వం విస్మరించిన అంశాలను, ప్రజల గోడును ప్రభుత్యానికి అర్ధమయ్యే రీతిలో చెప్పాల్సిన ఆవశ్యకత ప్రతిపక్ష పార్టీదే.
అసెంబ్లీ లో అధికార – ప్రతిపక్షాలు మాటలతో యుద్ధం కాకుండ ప్రజా సమస్యల పై యుద్ధం చేస్తే చూడాలని ఎదురుచూడడం ప్రజల వంతు అవుతుంది.



