అప్పుడు ఎన్టీఆర్ ఫీల్ అవ్వలేదు.. మరి ఇప్పుడు అల్లు అర్జున్?

NTR Allu Arjun God of War

బుచ్చిబాబు ఎంత కాదని చెప్పినా.. “పెద్ది” మొదలైంది ఎన్టీఆర్ దగ్గరే, దాదాపుగా ఎనౌన్స్ చేశాక, ఎన్టీఆర్ క్లైమాక్స్ విషయంలో కన్విన్స్ అవ్వకపోవడంతో, అదే ప్రాజెక్ట్ రామ్ చరణ్ దగ్గరకి వెళ్లింది. ప్రమోషనల్ కంటెంట్ రిలీజైనప్పుడల్లా “అరెరే ఎన్టీఆర్ మిస్ అయ్యాడే!” అనిపించేది. పాటలు, ప్రమోలు అదిరిపోవడంతో ఎన్టీఆర్ అనవసరంగా మిస్ చేసుకున్నాడు అని అతడి అభిమానులు కూడా ఫీల్ అయ్యారు. కట్ చేస్తే.. సినిమా రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అయ్యింది. ఎన్టీఆర్ సినిమా ఒప్పుకోకపోవడమే మంచిదైంది అని అందరూ అభిప్రాయపడ్డారు. దాంతో ఎన్టీఆర్ సేఫ్ అయ్యాడు కాబట్టి ఎన్టీఆర్ కూడా బాధపడాల్సిన అవసరం లేదు అనుకుందాం.

అయితే.. ఇప్పుడు త్రివిక్రమ్ ఇవాళ ఎనౌన్స్ చేసిన “గాడ్ ఆఫ్ వార్” (వర్కింగ్ టైటిల్) మొదట ఎన్టీఆర్ తోనే అనుకున్నప్పటికీ, ఆ తర్వాత అదెందుకో కాస్త పక్కకి జరిగింది. సడన్ గా అల్లు అర్జున్ సీన్ లోకి వచ్చాడు. పాపం ఈ విషయంలో నాగవంశీ ఎన్టీఆర్ అభిమానులతో బూతులు తిట్టించుకోవాల్సి వచ్చింది. కట్ చేస్తే.. మళ్లీ ఆ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరకే చేరుకోవడం, ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్ అవ్వడం అనేది చర్చనీయాంశం అయ్యింది.

ADVERTISEMENT

మరి “పెద్ది” విషయంలో ఎన్టీఆర్ కి సినిమా వదులుకున్నాను అనే బాధ లేకుండా చేసింది ఆ సినిమా రిజల్ట్. మరి ఇప్పుడు “గాడ్ ఆఫ్ వార్” విషయంలో అల్లు అర్జున్ ఎలా ఫీల్ అవుతాడు? అనేది 2029కి కానీ తెలియదు. అల్లు అర్జున్ రిగ్రెట్ అయ్యేలా ఉండాలి అనే కోరుకోవాలి ప్రస్తుతానికి. ఎందుకంటే.. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్టీఆర్ కంటే త్రివిక్రమ్ కి చాలా అవసరం. ఎందుకంటే.. ఈ సినిమాతోనే త్రివిక్రమ్ పాన్ ఇండియన్ డైరెక్టర్ గా తన మార్క్ ప్రూవ్ చేసుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories