జగన్‌ని నమ్మి అధికారం ఇచ్చినందుకు భరించాల్సిందే!

Andhra-Pradesh-Power-Bills-Farmers

ప్రజలు నమ్మి జగన్‌కి అధికారం కట్టబెడితే వారి ఆకాంక్షలు గుర్తించకుండా మళ్ళీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం ఓ తప్పు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా అప్పులపాలు చేయడం మరో తప్పు.

ADVERTISEMENT

రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పి దానిని పాడుబెట్టి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం మరో తప్పు. తద్వారా లక్షల కోట్ల నష్టం కలిగించడం ఇంకా పెద్ద తప్పు.

జగన్‌ వంటి వ్యక్తిని ఎన్నుకుని అధికారం కట్టబెట్టినందుకు రాష్ట్రం, ప్రజలు మూల్యం చెల్లించక తప్పదని సరిపెట్టుకున్నా, ఆయన హయాంలో చేసిన తప్పులకు నేటికీ ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తుండటం చాలా బాధాకరమే.

అటువంటిదే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపు కూడా. జగన్‌ హయాంలో ఎడాపెడా సర్దుబాటు ఛార్జీలు వడ్డిస్తూ ప్రజలపై చాలా భారం మోపారు. కానీ ఇంకా ఆ బకాయిలు ఉండిపోయాయి. వాటిని ఇప్పుడు ప్రజలు చెల్లించక తప్పదు.

ఎందువల్ల అంటే, జగన్‌ ప్రభుత్వం నాడు జెన్కో ప్లాంట్లకి బదులు బహిరంగ మార్కెట్ల నుంచి విద్యుత్ కొనుగోలుకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బహుశః కమీషన్ల కోసం అయ్యుండవచ్చు.

2022-23లో ఆరు నెలలకి రూ.6,072.86 కోట్లు, 2023-24లో 12 నెలలకు రూ. 11,826.42 కోట్లు ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచి వసూలు చేసి ఉండాలి. అవి మొత్తం రూ. 17,899.28 కోట్లు పేరుకుపోయాయి.

డిస్కంలు ఈ భారం భరించలేక అల్లాడిపోతున్నాయి. అలాగని ఇప్పుడు ఈ భారం ప్రజలపై మోపితే భరించడం కష్టం. ఇంకా ఆలస్యం చేస్తే డిస్కంలు మునిగిపోతాయి.

కనుక 15 నెలలో రూ.6,072.86 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్ నియంత్రణ మండలి శుక్రవారం అనుమతించింది.

ఈ ఇంధన సర్దుబాటు చార్జీల క్రింద ఒక్కో యూనిట్‌పై అదనంగా రూ.1.21 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కనుక నవంబర్‌ నెలలో వచ్చే విద్యుత్ బిల్లులు ప్రజలకు పెద్ద షాక్ ఇవ్వబోతున్నాయి.

అప్పటి నుంచి 15 నెలల పాటు ఈ షాకులు భరించక తప్పదు. దీనికి అదనంగా 2024-25 తాలూకు భారం కూడా త్వరలోనే ప్రజల నెత్తిన పడబోతోంది.

ADVERTISEMENT
Latest Stories