కాస్ట్యూమ్స్ తో మురిపించిన అనుష్క!

anushka sharma distributes nush garments to teammatesబాలీవుడ్‌ బ్యూటీ, టీమిండియా కోహ్లీ ప్రేయసి అనుష్క శర్మ తన సినిమా సెట్‌ లోని మహిళలకు సర్ ప్రైజ్ ఇచ్చింది. షారూఖ్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్మ శర్మ ప్రధాన తారాగణంగా ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న అనుష్క శర్మ సహ నటీమణులతో పాటు యూనిట్ లో పని చేస్తున్న ఇతర మహిళలకు తన దుస్తుల సంస్థ ‘నుష్‌’ నుంచి ట్రెండీ వేర్ ను తెప్పించి బహూకరించింది.

ADVERTISEMENT

దీంతో వారంతా తెగ సంబరపడిపోయారు. అనుష్క తమతో చాలా సరదాగా ఉంటుందని, తమ ఇష్టాయిష్టాలు తెలుసుకుంటుందని తెలిపారు. అలా వారి ఇష్టాలకు అనుగుణంగా ఉన్న దుస్తులను తెప్పించి ఇచ్చిందని వారు తెలిపారు. తన అందంతో అటు ప్రేక్షకులను, సరదాతనంతో ఇటు చిత్ర యూనిట్ ను ఈ అందాల బొమ్మ బుట్టలో పడేసిందన్న మాట.

ADVERTISEMENT
Latest Stories