పదో తరగతి ఫలితాలు… నారా లోకేష్‌ కూడా పాస్!

Government school students celebrating AP 10th results with improved pass percentage and smiling faces showing success in exams

పదో తరగతి ఫలితాలు ఎప్పుడు వెలువడినా ప్రైవేట్ కార్పోరేట్ స్కూల్స్ ‘మావే అన్ని ర్యాంకులు’ అంటూ ప్రకటనలతో హోరేత్తిస్తుంటాయి. నిన్న ఫలితాలు వెలువడగానే మళ్ళీ అదే చేస్తున్నాయి.

ఓ పక్క వాటి హోరు కొనసాగుతుండగానే రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్ధుల ఫోటోలు, వారు సాధించిన మార్కులతో ప్రముఖ తెలుగు దిన పత్రికలో ఫుల్ పేజ్ ప్రకటన వెలువడటం విశేషం.

ADVERTISEMENT

ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్ధుల ఫోటోలు, మార్కులతో ఫుల్ పేజ్ యాడ్ చూడటం రాష్ట్ర ప్రజలకు కూడా ఇదే తొలిసారి. కనుక అందరూ ఆసక్తిగా చూశారు. అయితే ఇది రాత్రికి రాత్రి జరిగినది కాదు.

దాదాపు రెండేళ్ళ క్రితం నారా లోకేష్‌ ఏరికోరి విద్యాశాఖ తీసుకొని, మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చేసిన కృషి ఫలితమే ఈ ఫలితాలు.

ముందుగా ప్రభుత్వ పాఠశాలలకు పాకిన రాజకీయ రంగులు, బొమ్మలు వంటివాటిని పూర్తిగా తొలగించి, పాఠశాలలు కేవలం చదువులకే పరిమితం అయ్యేలా చేశారు. గత ప్రభుత్వం పాఠశాల విద్యావ్యవస్థపై, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలపై చేసిన పిచ్చిపిచ్చి ప్రయోగాల కారణంగా అనేక సమస్యలు తలెత్తాయి. ఆ సమస్యలన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరిస్తూ విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చాలా కృషి చేశారు.

మంత్రి నారా లోకేష్‌ చొరవ, అధికారులు, ఉపాధ్యాయుల సమిష్టి కృషి వల్లనే ఈసారి పదో తరగతి ఫలితాలలో ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్ళ విద్యార్ధులతో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు పోటీ పడి నిలబడగలిగారు.

భ్రష్టు పట్టిన వ్యవస్థలను సరిదిద్ది ఉత్తమ ఫలితాలు సాధించడం మామూలు విషయం కానే కాదు. కానీ నారా లోకేష్‌ కూడా తండ్రి సిఎం చంద్రబాబు నాయుడులాగే సమస్యలను సవాలుగా స్వీకరించి వాటిలో నుంచే అవకాశాలు వెతుక్కుంటూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని గాడిన పెట్టారు.

నిన్న వెలువడిన పదో తరగతి ఫలితాలు, వాటిలో గణనీయంగా పెరిగిన ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల పెరిగిన ఉత్తీర్ణత ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. నిజానికి ఈ ఫలితాలు పదో తరగతి-విద్యార్ధులకు సంబందించినవే అయినా వారితో పాటు మంత్రి నారా లోకేష్‌ కూడా ఈ పరీక్ష పాస్ అయినట్లే!

ADVERTISEMENT
Latest Stories