పదేళ్ల భవిష్యత్ కి ఈ మూడేళ్లే కీలకం…!

Next three years seen as decisive for Andhra Pradesh coalition government and long-term development

కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు అధికారంలో ఉండాలి, ఉంటుంది, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉండాలి, ఉంటారు, టీడీపీ+ జనసేన + బీజేపీ ఈ మూడు పార్టీల పొత్తు మరో పదేళ్ల పాటు ఇలానే కొనసాగాలి, కొనసాగుతుంది అంటూ జనసేన అధినేత , ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన కళ్యాణ్ పదేపదే చాల బలంగా చెపుతున్నారు, అంతే బలంగా నమ్ముతున్నారు కూడా.

అయితే పవన్ చెప్పే ఈ మాటలు, ఇస్తున్న ఈ భరోసా రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో సాయపడుతుంది. అలాగే ప్రత్యర్థి వైసీపీ ని మరెంతగానో ఆందోళన పెడుతుంది. అలాగే పవన్ చేస్తున్న ఈ ప్రకటనలను అటు టీడీపీ అధినేత హోదాలో బాబు, టీడీపీ భవిష్యత్ నాయకుడి హోదాలో లోకేష్ కూడా బలపరుస్తున్నారు, అలాగే బీజేపీ సైతం ఈ వ్యాఖ్యలను సమర్దిస్తుంది.

ADVERTISEMENT

రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి తో కళకళలాడాలన్నా, రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాలు పూర్తి కావాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, పారిశ్రామిక ప్రగతి జరగాలన్నా, ఏపీ ఆర్థికంగా బలపడాలన్నా అందుకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న బాబు లాంటి నాయకుడు తప్పనిసరి అని ఈ మూడు పార్టీల నేతలు బలంగా విశ్వసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ ఆశ అడియాసలు కాకుండా ఉండాలన్నా, బాబు ఆశయాలు విజయాలను అందుకోవాలన్నా అందుకు రానున్న ఈ మూడేళ్ళ కాలం ఈ ఇద్దరి నేతలకు, ఈ రెండు పార్టీలకు అత్యంత కీలకం కానుంది. కూటమి అధికారంలో వచ్చి ఇప్పటికే ఏడాదిన్నర గడిచింది.

అలాగే ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన అన్ని సంక్షేమం పథకాలు ప్రజాక్షేత్రంలో అమలవుతున్నాయి. ఇక రానున్న మూడున్నరెళ్ళ కాలంలో చెప్పిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందుకు తెస్తే కూటమి అనుకుంటున్న లక్ష్యాన్ని అందుకోవడం సులభం అవుతుంది.

అమరావతి అభివృద్ధి తో పాటు విశాఖ ఐటీ పారిశ్రామిక ప్రగతి, పోలవరం పూర్తి వంటి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగితే, క్వాంటం వ్యాలీ, డేటా సెంటర్ వంటి అత్యాధునిక టెక్నాలిజీ ని అందుబాటులో ఉంచగలిగితే కూటమి చిత్తశుద్ధి ప్రజలకు అర్ధమవుతుంది.

ఆర్దికంగా, సామాజికంగా, అభివృద్ధి పరంగా నాటి వైసీపీ ప్రభుత్వానికి నేటి కూటమి పాలనకు ఖచ్చితమైన వ్యత్యాసం చూపగలిగితే కూటమి లక్ష్యం కొంతవరకు విజయం సాధించినట్టే అవుతుంది. అలాగే అటు వైసీపీ ని కూడా దాని పరిధికి తగ్గ స్థాయిలో కట్టడి చేసి పారిశ్రామిక వేత్తలకు వారి పెట్టుబడులకు తగ్గ కనీస భద్రత కల్పించి వారిలో ఒక భరోసా నింపాలి.

అలాగే నాడు హై టెక్ సిటీతో ఐటీ రంగానికి పునాదులేసినట్టు నేడు AI వాడకాన్ని పట్టాలెక్కుస్తున్న బాబు అందుకు తగ్గ వసతులను ఏర్పాటు చెయ్యాలి. ఇలా బాబు పాలనలో రాష్ట్రంలో సంక్షేమం – అభివృద్ధి రెండు జోడెడ్ల బండి అనేదాన్ని మరోసారి కూటమి నిరూపించుకోగలిగితే ఏపీ భవిష్యత్ కూటమి సొంతం అవుతుంది.

164 సీట్లతో ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈ మూడు పార్టీల అధినేత గుర్తించి గౌరవిస్తే మరోపదేళ్ళ అధికారం కోసం రానున్న ఈ మూడేళ్లు అత్యంత శ్రద్ద శక్తులతో శ్రమించాహ్ల్సి ఉంటుంది. లేకుంటే వైసీపీ 2.0 తో ఏపీ మరోసారి రాజధాని కోసం అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సిందే. అభివృద్ధి కోసం మరోసారి వనవాసం చెయ్యాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories