ప్లీజ్…ఎవరైనా ‘అనుమతి’ ఇవ్వండి..!

EX CM YS Jagan

వైసీపీ ఓటమి తరువాత తాడేపల్లి ప్యాలస్ టూ బెంగళూర్ ప్యాలస్ ల చుట్టూ చక్కర్లు కొడుతూ వీకెండ్ రాజకీయాలు చేస్తూ, ఇప్పటికి తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటూ ముందుకెళుతున్న మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ ఈ సంక్రాంతి తరువాత నుంచి ప్యాలస్ లను వదిలి ప్రజలలోకి రాబోతున్నట్టు ప్రకటించారు ఆ పార్టీ నేతలు.

అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే ప్రజల నుండి ఎన్నడూ లేని విధంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుందని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రభుత్వం ముందుకెళుతూ, కక్ష్య పూరిత రాజకీయాలకు నాంది పలికిందంటూ జగన్, ప్రభుత్వం మీద ప్రభుత్వ పెద్దల మీద సోషల్ మీడియాలో విమర్శలు చేసిన వైనం తెలిసిందే.

ADVERTISEMENT

అయితే అందుకు గాను తానూ ప్రజా క్షేత్రంలోకి వచ్చి ఆయా నియోజకవర్గాలలో పర్యటించి అక్కడి పార్టీ నేతలకు, కార్యకర్తలకు భరోసా కల్పించి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు మాట దాటేస్తూ మడం తిప్పుతున్నారు. అయితే అప్పుడు నా రాకకు నేను సిద్ధం మరి మీరు సిద్ధమా.? అంటూ పార్టీ క్యాడర్ ను లీడర్లను అనుమతి కోరిన జగన్ ఇప్పుడు మరో అనుమతి కోసం కోర్ట్ ను ఆశ్రయించారు.

అయితే రాష్ట్ర స్థాయి పర్యటనలకు గాను పార్టీ శ్రేణుల నుంచి అనుమతి కోరిన జగన్ కు వారి నుండి ఏ సమాధానం ఎదురయ్యిందో కానీ ఇప్పుడు ఆ రాష్ట్ర స్థాయి నియోజకవర్గాల పర్యటనలకు స్వస్తి పలికి తన విదేశీ పర్యటనకు (లండన్) అనుమతి కావాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

గత పదేళ్ల నుండి బెయిలు మీద ఉంటూ రాజకీయం చేస్తున్న ఈ మాజీ ముఖ్యమంత్రి దేశం దాటి వెళ్లాలంటే కోర్ట్ అనుమతి తప్పనిసరి కావడంతో ఆ దిశగా న్యాయస్థానానికి అభ్యర్ధనలు మొదలుపెట్టారు. అయితే గత ఏడాది విజయవాడలో వరదలొచ్చినా సమయంలో లండన్ పర్యటనకు అనుమతి కావాలంటూ కోర్ట్ కెళ్లిన జగన్ అనూహ్యంగా దాన్ని ఉపసంహరించుకున్నారు.

మళ్ళీ ఇప్పుడు ఆ అభ్యర్ధనను కోర్ట్ ముందుకు తీసుకు వచ్చారు. తనకు ఒక నెల రోజుల పాటు లండన్ పర్యటనకు గాను అనుమతి కావాలంటూ కోర్ట్ మెట్లెక్కారు జగన్. అయితే కనీసం న్యాయస్థానాలైన ఆయన గారి అభ్యర్డునకు అనుమతి ఇచ్చి లండన్ యాత్రకు పచ్చ జెండా ఊపుతారా.? లేదా చూడాలి.

రాష్ట్ర స్థాయి పర్యటనలకు పార్టీ నాయకులు, పార్టీ క్యాడర్ మొఖం చాటేస్తూ పరోక్షంగా జగన్ పర్యటనలకు అనుమతి నిరాకరిస్తున్నారు. ఇప్పుడు మరి జగన్ విదేశీ పర్యటనకైన న్యాయమూర్తుల నుండి అనుమతి వస్తుందా.? ఇలా కొన్నాళ్ళు బెంగళూర్ ప్యాలస్, మరికొన్నాళ్లు విదేశీ పర్యటనలు, ఇంకొన్నాళ్ళు సోషల్ మీడియా రాజకీయాలు చేస్తూ జగన్ ప్రస్తుతానికి పార్ట్ టైం పొలిటిషన్ గా మారిపోతున్నారు సుమీ..!

ADVERTISEMENT
Latest Stories