‘బాహుబలి’ ఇక్కడ… ఖేల్ ఖతమ్… దుకాణం బంద్..!

AP Government Employee - padmaహైదరాబాద్ నుండి అమరావతికి ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు సర్కార్ తరలిస్తున్న సమయంలో… చాలామంది ఉద్యోగులు తమకు స్పెషల్ బస్సులను కావాలని, కార్లను కావాలని, ఫ్లైట్ లను ఎరేంజ్ చేయమని వారి వారి గొంతెమ్మ కోర్కెలను ప్రభుత్వం ముందుంచగా, ఒక మహిళ మాత్రం హైదరాబాద్ నుండి సైకిల్ మీద బయలుదేరి అమరావతికి చేరుకుంది. దీంతో అప్పట్లో సదరు మహిళా ఉద్యోగినిపై సర్వత్రా అభినందనల వర్షం కురిపించారు. మరి ఆ ఉద్యోగి ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది? అంటే…

ఏసీటీఓ (అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్)గా విధులు నిర్వహిస్తున్న పద్మ ప్రస్తుత వైఖరి చర్చనీయాంశమైంది. తిరువూరులో ఏసీటీవోగా ఉన్న ఆమె ఓ సిమెంట్ షాపుకు వెళ్లి తనిఖీలు చేయాలంటూ హడావుడి చేశారు. అక్కడ పద్మ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ… సిమెంట్ బస్తాలను నాశనం చేస్తుండటంతో షాపు యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులపై తిరుగుబావుట ఎగురవేసిన పద్మను బలవంతంగా అక్కడి నుంచి స్టేషన్ కు తరలించారు.

ADVERTISEMENT

అక్కడ కూడా తనను ఎందుకు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు? నాపై అధికారిని రమ్మనండి… నేను లోనికి రాను అంటూ స్టేషన్ ఆవరణలోని మట్టి నేలపైనే కూర్చుని హంగామా చేసారు. ఆ తర్వాత బుజ్జగింపులతో అక్కడ నుండి లేచినప్పటికీ, తన కోసం కుర్చీ కావాలని మారం చేయడంతో, స్టేషన్ బయటే కుర్చీలో కూర్చుని, తన గురించి ఏమనుకుంటున్నారు? అంటూ ఓ వ్యాఖ్యానించింది. ‘బాహుబలి ఇక్కడ… ఏమనుకుంటున్నారో ఏమో… ఖేల్ ఖతమ్… దుకాణ్ బంద్…’ అంటూ కాలు మీద కాలేసుకుని వ్యాఖ్యలు చేసింది.

ఈమె వైఖరితో పోలీసులు కూడా తలలు పట్టుకోవడంతో, ఆమె కుటుంబ సభ్యులకు కబురు పంపారు. ఆ తర్వాత వారు రావడంతో, పద్మను కుటుంబ సభ్యులకు అప్పగించి, పోలీసులు తమ భారాన్ని వదిలించుకున్నారు. అయితే గత కొన్నాళ్లుగా పద్మ మానసిక స్థితి సరిగా లేదని బంధువులు వెల్లడిస్తుండటం గమనార్హం. అయితే హైదరాబాద్ నుండి అమరావతికి ఒంటరిగా సైకిల్ పై వచ్చేటంత ధైర్యం కలిగిన ఈ మహిళా ఉద్యోగికి ఇంతలోనే ఏమయ్యింది? అన్న ఆసక్తి మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories