ఏపీ ఐఏఎస్ బదిలీలు: కీలక పోస్టుల్లో మార్పులు

AP Government Transfers 14 IAS Officers

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించింది.

ఇప్పటివరకు గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన పి. శ్రీనివాసులును బదిలీ చేసి, ఆయనను మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా నియమించింది. ప్రస్తుతం మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా ఉన్న రోణంకి గోపాలకృష్ణను వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా బదిలీ చేస్తూ కీలక బాధ్యతలు అప్పగించింది.

ADVERTISEMENT

పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా శ్రీవాస్‌ నుపుర్‌ అజయ్‌కుమార్‌ను, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కల్పన కుమారిని, గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా మయూర్‌ అశోక్‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే అనకాపల్లి జాయింట్ కలెక్టర్‌గా మల్లవరపు సూర్యతేజను నియమించింది.

చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్‌ రాజేంద్రన్‌ను, గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఎస్‌.ఎస్‌. శోబికను, కడప జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనాను, విశాఖ జాయింట్ కలెక్టర్‌గా గొబ్బిళ్ల విద్యాధరిని ప్రభుత్వం నియమించింది. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా శివ్‌ నారాయణ్‌ శర్మను, పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వి. సంజనా సింహను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కడప జాయింట్ కలెక్టర్‌గా నియమితులైన నిధి మీనా, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ భార్య కావడం గమనార్హం.

ADVERTISEMENT
Latest Stories