
జీఎస్టీ విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అత్యధికంగా రూ.3,354 కోట్లు వసూలు అయ్యిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించగా, అవన్నీ తప్పుడు లెక్కలని ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని మాజీ సిఎం జగన్ ట్వీట్ చేశారు.
జగన్ 5 ఏళ్ళ పాలన అప్పులు, అరాచకమే తప్ప అభివృద్ధిని పట్టించుకోకపోవడం వలననే నేడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దయనీయంగా మారింది.
Also Read – ఒవైసీ రాజకీయాలు వైసీపీ కోసమేనా.?
తాను సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచుతుండేవాడినని, కనుక ప్రజల చేతుల్లో ఎప్పుడూ డబ్బులుండేవని, ఆ కారణంగా వారు పండగలకు, పబ్బలకు భారీగా ఖర్చు చేస్తుండేవారని, కొనుగోళ్ళు పెరగడంతో ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం భారీగా ఉండేదని జగన్ నిసిగ్గుగా చెప్పుకుంటున్నారు.
ఎడాపెడా అప్పులు చేస్తూ, ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేస్తూ తెచ్చిన డబ్బుని ప్రజలకు పంచడం గొప్పని జగన్ చెప్పుకోవడాన్ని ఏమనుకోవాలి? నేటికీ ఆ వాపుని చూపిస్తూ బలుపని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
Also Read – చెవిరెడ్డి అరెస్ట్.. తర్వాత ఎవరు?
నాడు జగన్ చేసిన ఈ నిర్వాకం వల్లనే రాష్ట్ర ఆదాయంలో సగానికి సగం అప్పులు, వడ్డీల చెల్లింపుకు వెళ్లిపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి అత్యధికంగా రూ.3,354 కోట్లు ఆదాయం రాగా దానిలో రూ.796 కోట్లు అప్పులు, వడ్డీలకు వెళ్ళిపోయిందని ప్రభుత్వమే చెప్పింది.
కనుక తన హయంలో చేసిన ఆర్ధిక అరాచకం వల్లనే నేడు రాష్ట్ర ఆదాయంలో ఇన్ని వందల కోట్లు అప్పులకు పోతుంటే అందుకు జగన్ సిగ్గుపడాలి కానీ ఆవేదన ఎందుకు?
Also Read – ఫోన్ ట్యాపింగ్ కేసులో.. జగన్ కూడా?
జగన్ హయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నెలనెలా జీతాలు కూడా చెల్లించలేకపోగా వారు దాచుకున్న జీపీఎఫ్ డబ్బు కూడా తీసి వాడేసుకున్నారు కదా? అప్పుడే ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా దివాళా తీయబోతోందని అందరూ భయపడ్డారు కదా?
అలాంటి దయనీయ పరిస్థితి నుంచి రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.3,354 కోట్లకి పెరిగిందంటే అది చంద్రబాబు నాయుడు చేస్తున్న అనేక ప్రయత్నాల వల్లనే కదా?
ప్రభుత్వం మారిన తర్వాతే రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, గూగుల్ వంటి అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయి. అవన్నీ ఏర్పాటవుతున్న కొద్దీ వాటి ద్వారా జీఎస్టీ ఆదాయం పెరుగుతుంది. అలాగే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కనుక ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. కనుక ప్రజలు నమ్మి ఒక్క ఛాన్స్ ఇస్తే కేవలం 5 ఏళ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసిన జగన్ మొసలి కన్నీళ్ళు కార్చడం సిగ్గుచేటు.