యువతకు ఉగాది కానుక: రేపే జ్యాబ్ క్యాలండర్

AP Job Calendar Ugadi announcement with 10,000 government jobs for youth

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో జాబ్ క్యాలండర్ ప్రకటించడం కూడా ఒకటి. రేపు ఉగాది పండుగ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ సోషల్ మీడియాలో జాబ్ క్యాలండర్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

దానిలో 2,600 టీచర్ పోస్టులు, 1,500 లెక్చరర్స్, 1,400 కానిస్టేబుల్స్, గ్రూప్-1,2 కలిపి 600 పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

అంతే కాదు… ఇకపై ఏటా డీఎస్సీ నోటిఫికేషన్స్ వెలువడబోతున్నాయి. రాబోయే మూడేళ్ళలో వరుసగా మూడు డీఎస్సీలు ప్రకటించి మొత్తం 7,500 టీచర్ పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వాటికీ రేపే జాబ్ క్యాలండర్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. అన్నీ కలిపి 10,000కి పైగా పోస్టుల భర్తీకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

జ్యాబ్ క్యాలండర్ ప్రకటించగానే ఆ ప్రకారం వరుసగా నోటిఫికేషన్స్ జారీ అవుతుంటాయి! ఏయే ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్స్ వెలువడుతాయనే విషయం ముందుగా తెలిస్తే, నిరుద్యోగ యువత ఆయా పోటీ పరీక్షలకు చక్కగా సిద్ధమవ్వగలరు.

గత 5 ఏళ్ళలో జరిగిన ఆర్ధిక, సామాజిక, రాజకీయ, పారిశ్రామిక, వాణిజ్య విధ్వంసం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మళ్ళీ ఎప్పటికైనా కోలుకోగలదా? అనే సందేహాలు వ్యక్తమయ్యేవి.

కానీ సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పెను మార్పులు మొదలయ్యాయి.

గత ప్రభుత్వం చివరి వరకు డీఎస్సీ గురించి మాయమాటలు చెపుతూనే కాలక్షేపం చేసి దిగిపోయింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే తొలి డీఎస్సీ ప్రక్రియ పూర్తిచేసి అప్పుడే రెండో డీఎస్సీకి సిద్దమవుతోంది. రాబోయే మూడేళ్ళకు కూడా జ్యాబ్ క్యాలండర్ ప్రకటించడం ప్రభుత్వ చిత్తశుద్ధిని నిదర్శనంగా భావించవచ్చు.

ప్రస్తుతం ఒక్క అమరావతిలోనే సుమారు 25-30,000 మంది, పోలవరంలో సుమారు మరో 7,000 మంది ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్నారు.

కేవలం ఏడాదిన్నరలోనే లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు, పోర్టులు.. వాటికి అనుబంధంగా భారీ పారిశ్రామికవాడలు ఏర్పాటవుతున్నాయి. వాటి నిర్మాణ సమయంలోనే వేలమందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుంది. వాటి నిర్మాణాలు పూర్తిచేసుకొని కార్యకలాపాలు మొదలైతే లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

కనుక ఓపక్క ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ఖాళీలను భర్తీ చేస్తూనే, మరోపక్క ప్రైవేట్ రంగంలో లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కనుక మూడేళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రం సమూలంగా మారిపోబోతోంది.

ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ప్రజలు రాజకీయ ప్రయోగాలు చేయడం మానుకోవడం చాలా అవసరం. ఒకవేళ చేస్తే 5 ఏళ్ళు ‘రప్పారప్పా’ మాత్రమే ఉంటుందని జగన్‌ స్వయంగా చెపుతున్నారు కూడా! .

ADVERTISEMENT
Latest Stories