తెలంగాణ శాసనసభకు ఈ ఏడాది డిసెంబర్‌తో పదవీకాలం ముగుస్తుంది కనుక ఈసీ అక్కడ రిటర్నింగ్ అధికారులను నియమించింది. అయితే ఏపీ శాసనసభ పదవీకాలం 2024 మే వరకు ఉంది. కనుక అప్పటి వరకు పూర్తికాలం అధికారంలో కొనసాగుతామని వైసీపీ నేతలు పదేపదే చెపుతున్నారు.
కానీ ఏపీలో కూడా రిటర్నింగ్ అధికారులను ఏసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది! ఈసీ ఎన్నడూ 8 నెలల ముందు ఏ రాష్ట్రంలోను రిటర్నింగ్ అధికారులను నియమించలేదు. ఎందుకంటే ఇంత ముందుగా నియమిస్తే వారిపై అధికార పార్టీ ఒత్తిళ్ళు మొదలైపోతాయి. వారు చేస్తున్న ఉద్యోగాలు, పనులపై కూడా ఆ ప్రభావం పడుతుంటుంది. బదిలీలకు, పదోన్నతులకు అడ్డంకిగా మారుతుంది. ఇంకా అనేక కారణాలున్నాయి. కనుక ఈసీ సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే ఒకటి రెండు నెలల ముందు రిటర్నింగ్ అధికారులను ఖరారు చేస్తుంటుంది. ఇప్పుడు ఏపీ రిటర్నింగ్ అధికారులను కూడా ఖరారు చేయడంతో జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు సిద్దమవుతునట్లు భావించాల్సి ఉంటుంది.
అయితే ముందస్తుకు వెళ్ళాలని ప్రధాని నరేంద్రమోడీయే సిఎం జగన్మోహన్ రెడ్డికి సూచించిన్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికలలో అధికార, ప్రతిపక్షాలు రాష్ట్రానికి సంబందించిన అంశాలను హైలైట్ చేస్తూ పోరాడుతాయి. రాష్ట్ర ప్రజలు కూడా వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉంటే పెద్దగా తేడా ఉండదు కానీ ఏపీలో టిడిపి, వైసీపీ, జనసేన మూడు పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. కనుక శాసనసభతో కలిపి లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే బిజెపి నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని ప్రధాని నరేంద్రమోడీ సూచించిన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రభుత్వాన్ని రద్దు చేసి శాసనసభ ఎన్నికలు నిర్వహించవలసిందిగా ఈసీని కోరవలసి ఉంటుంది. అప్పులు, కేసులు కారణాలు ఏవైతేనేమీ… జగన్ కూడా ముందస్తుకి వెళ్ళేందుకు సిద్దమైనందునే ఏసీ రిటర్నింగ్ అధికారులను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదలచేసి ఉండవచ్చు. మంత్రి గుడివాడ అమర్నాథ్ దసరాకి చెప్తామంటున్న శుభవార్త ఇదేనేమో?



