విజయవాడలో ఇక విద్యుత్‌ బస్సులు మాత్రమే?

APSRTC to Convert Diesel Buses Into Electric by March 2026

దేశంలో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మహానగరాలలో వాయు కాలుష్యం నానాటికీ పెరుగుతూనే ఉంది. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే తప్ప ఎన్నడూ కిందకి దిగిరావడం లేదు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాల కొనుగోలుపై రాయితీలు కూడా ఇస్తున్నాయి. కనుక ప్రజలు ఇప్పుడు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు.

ADVERTISEMENT

కేంద్ర ప్రభుత్వం రాయితీపై రాష్ట్రాలకు విద్యుత్‌ బస్సులు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీలు డీజిల్ భారం భరించలేక పోతున్నాయి. కనుక రెండు రాష్ట్రాలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యుత్ బస్సులు కొనుగోలు చేస్తున్నాయి.

కొత్త బస్సులు సరే! మరి ఇంకా మంచి కండిషన్‌లో ఉన్న డీజిల్ బస్సులను ఏం చేయాలి? వాటిని స్క్రాప్ చేస్తే చాలా నష్టం వస్తుంది. కనుక ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ రీజియన్‌లో సిటీ మరియు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చబోతోంది. ఈ రంగంలో మంచి అనుభవం ఉన్న ‘జీరో 21’ అనే ఓ ప్రైవేట్ కంపెనీకి ఈ బాధ్యతలు అప్పగించింది.

మొదట ప్రయోగాత్మకంగా కొన్ని డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చి ఉపయోగించిన తర్వాత, వాటి పనితీరు బాగుంటే మిగిలిన బస్సులను కూడా విద్యుత్ బస్సులుగా మార్చాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. మొదటి విడత బస్సులు వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా అందుబాటులోకి రానున్నాయి.

ADVERTISEMENT
Latest Stories