Are all victims In Phone Tapping?

తెలంగాణ రాజకీయాలలో సంచలనం రేపిన ఫోన్ టాపింగ్ కేసులో బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతూ పోతుంది. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ స్కాం లో బిఆర్ఎస్ పార్టీలోని నేతలతో సహా అందరు బాధితులుగా బయటకొస్తున్నారు.

నాడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ తమ ప్రత్యర్థి పార్టీ నాయకుల కదలికల మీద, సొంత పార్టీ నేతల రాజకీయం మీద నిఘా ఏర్పాటు చేయడానికి ఈ ఫోన్ టాపింగ్ అస్త్రాన్ని అనధికారికంగా వినియోగించుకుంది. అయితే ఈ కేసు విచారణ ముందుకెళ్లే కొద్దీ ఈ స్కాం వెనుక ఉన్న పెద్దమనుషుల పేర్లు బయటకొస్తున్నాయి.

Also Read – లేని వారి కోసం పోస్టులు..ఉన్న వారి పై కేసులా..?

ఇప్పటి వరకు బిఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ ఈ కేసులో ప్రధమ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. కేటీఆర్ ఆదేశాననుసరమే అప్పటి అధికారులు ఈ దుస్సాహసానికి పాల్పడ్డారు అనేది కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.

అయితే నాడు ఈ స్కాం బాధితులు ఒక్క కాంగ్రెస్ పార్టీకి చెందినవారే అయిఉంటారని అందరు భావించినప్పటికీ ఈ కేసు విచారణ లోతుగా తవ్వే కొద్దీ ఈ స్కాం లో కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఒక బాధితురాలే అన్న వార్తలు బయటకొచ్చాయి.

Also Read – వైసీపీ PHD లు ఎన్నో ఎన్నెన్నో.?

అలాగే వైస్ జగన్ సోదరి వైస్ షర్మిల కూడా ఫోన్ టాపింగ్ బాధితురాలే అంటూ షర్మిల పేరు తెరమీదకు రావడంతో ఏపీ రాజకీయాలకు ముఖ్యంగా వైసీపీ పార్టీకి ఈ టాపింగ్ నిప్పు అంటుకుంది.

ఇక నేడు బీజేపీ నాయకులు కూడా ఈ ఫోన్ టాపింగ్ లో మేము బాధితులమే అంటూ ఒక్కొక్కరుగా విచారణ కు హాజరయ్యి తమ ఆవేదన చెప్పుకుంటున్నారు. ఇందులో ఇప్పటికే ఈటెల రాజేంద్ర ప్రసాద్ అధికారుల ముందు తన గోడు వినిపించగా, ఇప్పుడు మరో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.

Also Read – రాజకీయాలలో మెట్టు దిగడం.. ఇలా కాదు!

ఇలా తెలంగాణలో సొంత పార్టీ శ్రేణులు ఫోన్ కాల్స్ తో పాటుగా, కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఫోన్లు కూడా టాప్ అవ్వడంతో ఈ కేసు అధికార పార్టీ ఉహించిన దాని కంటే చాల పెద్దెదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే ఈ ఫోన్ టాపింగ్ ఒక్క రాజకీయ పార్టీల నేతలకే కాదు దీనిలో కొంతమంది సినీ సెలబ్రెటీలు, మరికొంతమంది మీడియా ప్రతినిధులు, ఇంకొంతమంది బడా వ్యాపారవేత్తలు కూడా బాధితులే అన్నది విచారణలో వెల్లడవుతుంది.

ఇందులో భాగంగానే ABN మీడియా యజమాని వేమూరి రాధా కృష్ణ కూడా సిట్ ముందు హాజరయ్యారు. నేడు జూబ్లీ హిల్స్ సిట్ అధికార కార్యాలయంలో RK గంట సేపు తన వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు బయటుకు వచ్చిన వారి లిస్ట్ కంటే బయటకు రావలసిన వారి లిస్ట్ ఇంకా పెద్దగా ఉంది అనేలా వార్తలు గుప్పుమంటున్నాయి.




ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నిఘా నేత్రం పేరుతో పలు రంగాల ప్రముఖుల వ్యక్తిగత జీవితాలలోకి తొంగి చూసింది అనేది బాధితుల వాదన. మరి ఈ బాధితుల వాంగ్మూలాలతో బిఆర్ఎస్ పార్టీలో ఎవరి కి చెక్ పడనుండో చూడాలి.