చిన్నజీయర్ పేరు… గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో., టీవీ డిబేట్స్ లో ప్రముఖంగా వినపడుతోంది. “సమ్మక్క – సారక్క” అంటూ తెలంగాణాలో జరిగే వన జాతరను కించపరిచేలా చిన్నజీయర్ మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట కాక రాజేసింది.
తెలంగాణ సంస్కృతిలో భాగమైన ఈ సమ్మక్క – సారక్క జాతర అక్కడి అడవి బిడ్డలకు పెద్ద పండుగనే చెప్పాలి. రాను రాను ఈ జాతర ఏంతో ప్రసిద్ధి చెంది కేవలం అడవి బిడ్డల ఉత్సవంగానే కాకుండా ప్రజలందరూ జరుపుకోవడం మొదలు పెట్టారు.
విషయానికి వస్తే… ఈ జాతరను ఉద్దేశించి చిన్న జీయర్ మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన తెలంగాణ ప్రజలకు.., ఆ అడవితల్లి బిడ్డలకు వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ లీడర్ సీతక్క వ్యాఖ్యానించారు. చిన్నజీయర్ ఎప్పుడైనా అణగారిన వర్గాల వారి గుడిసేలకు వచ్చి తమ ప్రవచనాలు వినిపించారా? మీకెప్పుడు అగ్రవర్ణాల ధనికులతోనే సమయం సరిపోతుంది అంటూ ఘాటైన వ్యాఖ్యలే చేశారు.
ఈ స్వాములు కాషాయం ముసుగులో వ్యాపారమే కదా చేసేది అంటూ సీపీఐ నారాయణ కూడా చురకలు అంటించారు. ఒక టైపిస్టుగా ఆశ్రమంలో చేరిన జీయర్ ఇప్పుడు ఆశ్రమాల పేరుతో ఒక మాయాలోకాన్నే సృష్టిస్తున్నారు. సమత మూర్తి అంటూ విగ్రహాలను పెట్టి ఈయన చేస్తుందేంటి?వ్యాపారం కాదా? అంటూ ప్రశ్నించారు. ధనవంతులకు ఉచితంగా., సాధారణ ప్రజలకు 150 రూపాయలు టికెట్ ధర నిర్ణయించి సొమ్ము చేసుకోవడం లేదా అంటూ నిలదీశారు.
చినజీయర్ వ్యాఖ్యల మీద వ్యతిరేకతను వ్యక్తం చేయడంలో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కూడా ముందు వరుసలోనే ఉన్నారు. జీయర్ ఒక వెధవని., ఒకప్పుడు బ్లాక్ టికెట్లు అమ్మిన చరిత్ర కూడా తనకు తెలుసునని.., ఇలాంటి దుర్మార్గులు దేశమంతా తిరిగి చాలా పెద్ద మొత్తంలో సొమ్ము పోగు చేశారని., ఆ ఆశ్రమంలోనే అతనికి., అతనితో పాటు ఉంటున్న మరో స్వామీజీకి త్వరలో విభేదాలు రానున్నాయని.. పెద్ద ఎత్తున విమర్శలతో రెచ్చిపోయారు అశ్వనీదత్.
తెరాస ఎమ్మెల్యే రేగా కాంతారావు కూడా చిన్నజీయర్ ఆదివాసులకు బేషరతు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సందట్లో సడేమియాలా సోషల్ మీడియాలో మాత్రం మీమ్స్ తో., ట్రోల్స్ తో చిన్న జీయర్ స్వామిని ఒక ఆటాడుకుంటున్నారు నెటిజన్స్. సందు దొరికితే చాలు అన్న చందంగా ‘వాడు – వీడు’ అనే తేడా లేకుండా “ఏ బిడ్డా ఇది మా అడ్డా” అంటూ సోషల్ మీడియాను వాడేస్తున్నారు ఇప్పటి యూత్.
అయితే విచిత్రం ఏంటంటే ట్రోల్స్ తో సందడి చేస్తున్న చిన్నజీయర్ వీడియో ఇప్పటిది కాకపోయినా, గతానికి వెళ్లి మరి వీడియోను వైరల్ చేస్తుండంతో సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణలో సీఎం కేసీఆర్ కు చిన్నజీయర్ కు వచ్చిన విభేదాలే కారణం అంటూ చెవులు కోరుకుంటున్నారు వర్గీయులు.