atchutapuram-pharma-company-botsa-satyanarayana

తండ్రిని కోల్పోయిన పిల్లలని ఎవరైనా ఓదారుస్తారు. కానీ తండ్రిని కోల్పోయిన జగన్‌, ప్రజలను ఓదార్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతిని కూడా ఓదార్పు యాత్రలతో తన రాజకీయ ఎదుగుదలకి ఉపయోగించుకున్నారు. బహుశః అటువంటి పుత్రరత్నం మరెవరికీ ఉండకపోవచ్చు.

ఆ ఓదార్పు యాత్రలలో డ్రామాలని చూసిన తర్వాత ‘ఓదార్పు’కి పేటెంట్ హక్కులు జగన్‌కు తప్ప మరొకరికి లేవని ప్రజలు కూడా నమ్మేవారు. కనుక అచ్యుతాపురం ప్రమాద బాధితులను, వారి కుటుంబాలను ఆ ‘ఓదార్పు స్పెషలిస్ట్’ స్వయంగా వచ్చి ఓదార్చుతారనుకుంటే, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాద్‌ తదితరులను పంపించారు.

Also Read – కవిత లో జోష్ బిఆర్ఎస్ కు వరమా.? శాపమా.?

అలాగని జగన్మోహన్‌ రెడ్డి బెంగళూరు, లండన్‌లో లేరు. తాడేపల్లి ప్యాలస్‌లోనే ఉన్నారు. అమరావతి నుంచే సిఎం చంద్రబాబు నాయుడు విశాఖ వచ్చి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించినప్పుడు, తాడేపల్లి నుంచి జగన్‌ విశాఖ రాలేరా? వచ్చి ఓదార్చలేరా? అంటే త్వరలోనే వచ్చి ఓదార్చుతారని బొత్స సత్యనారాయణ సర్ధి చెప్పారు. అంటే అంతవరకు బాధితులు ఓదార్పు కోసం ఎదురుచూడాలన్న మాట!

‘ఓదార్పు స్పెషలిస్ట్’ రాలేదు కనుక బొత్స సత్యనారాయణ చొరవ తీసుకొని అందరినీ ఓదార్చారు. వారికి ఆయన ఏం చెప్పరో తెలీదు కానీ మీడియాకు మాత్రం ‘బాధితులను ఆదుకోవడంలో సిఎం చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారని’ తేల్చి చెప్పేశారు.

Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?

కానీ అప్పటికే చంద్రబాబు నాయుడు అచ్యుతాపురంలో ప్రమాదం జరిగిన పరిశ్రమలో పర్యటించి, ప్రమాదానికి కారణాలు, బాధితులకు అందించిన సహాయం గురించి అడిగి తెలుసుకొని, విశాఖ నగరంలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడుతూ అందరికీ ధైర్యం చెప్పారు. అవసరమైతే క్షతగాత్రులకు ఎంత ఖరీదైన వైద్యం అయినా అందిస్తామని, బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అనకాపల్లి జిల్లా ఎస్పీని ఆదేశించారు.

Also Read – కేసీఆర్‌ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?

సిఎం చంద్రబాబు నాయుడు సూచన మేరకు అప్పటికే విశాఖ జిల్లా కలెక్టర్‌ మృతుల కుటుంబాలకి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు కూడా.

ప్రమాదం జరిగిన 18 గంటలలోనే ఇవన్నీ జరిగాయి. అయినా ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ సోషల్ మీడియాలో వైసీపి, బాధితుల వద్ద బొత్స సత్యనారాయణ ఆరోపించడం శవరాజకీయాలు కాక మరేమిటి?
ఓదార్పు జగన్‌ హక్కు కదా… బొత్స బయలుదేరారేమిటి?