balakrishna mahesh babu episode latest promoఅభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బాలకృష్ణ – మహేష్ బాబుల ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఒకరు మాస్ కామెడీతో గిలిగింతలు పెడితే, మరొకరు క్లాస్ టచ్ సైటర్లతో నవ్విస్తారు. మరి ఈ ఇద్దరు హేమాహేమీలు కలిస్తే ఎలా ఉంటుందో అన్న దానికి నిదర్శనమే ఈ ప్రోమో.

ఫిబ్రవరి 4వ తేదీన ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్ కోసం ఇద్దరు హీరోల అభిమానులు నిరీక్షించేలా ప్రోమోను కట్ చేసారు. ‘ఏమ్మా… దేవుడ్ని ఎవరైనా చూస్తారా..’ అంటూ బాలకృష్ణపై మహేష్ వేసిన టైమింగ్ పంచ్ గురించి చెప్పడం కష్టం, చూడాల్సిందే! ప్రోమో క్లైమాక్స్ కు ఈ పంచ్ తో అదిరే హైప్ ఇచ్చారు.

అలాగే చిన్న పిల్లల గుండె ఆపరేషన్స్ చేయిస్తున్న మహేష్ గురించి ప్రత్యేకంగా చెప్పడం కాకుండా, గౌతమ్ పుట్టినపుడు అరచేయి అంత ఉన్నాడని, ఇప్పుడు ఆరు అడుగులు అయ్యాడని మహేష్ చెప్పిన వైనం, బాలయ్య రియాక్షన్స్ చూపరులను ఆకట్టుకున్నాయి.

నమ్రత గురించి ప్రస్తావిస్తూ మహేష్ ను బాలయ్య ఆటపట్టించడం చూస్తే ఈ ఎపిసోడ్ ‘అన్ స్టాపబుల్’ సీజన్ 1 ఎండింగ్ పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసారని అర్ధమవుతోంది. ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఈ ఎపిసోడ్ లో భాగస్వామ్యులు అయ్యారు.