
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో నెల రోజుల్లో పదవిలో నుంచి దిగిపోతారు. ఆయన స్థానంలో డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.
రష్యా-ఉక్రెయిన్ మద్య యుద్ధం మొదలై నేటితో (మంగళవారం) 1,000 రోజులు. ఈ సందర్భంగా జో బైడెన్ దిగిపోయే ముందు రష్యాతో ప్రత్యక్ష యుద్దానికి దారి తీసే ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?
ఉక్రెయిన్‌కి తాము అందిస్తున్న దీర్గశ్రేణి క్షిపణులను ఇక నుంచి రష్యా పై ప్రయోగించేందుకు జో బైడెన్ అనుమతించారు. ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో గేమ్ ఛేంజర్ అవుతుందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ సైబీగా వరించారు.
ఇది నిజం కూడా. ఏవిదంగా అంటే అమెరికా అందించిన క్షిపణులతో రష్యాపై ఉక్రెయిన్ దాడి చేసిన్నట్లయితే దానిని అమెరికా తమపై చేసిన దాడిగానే భావించి అమెరికాపై ఎదురుదాడి చేస్తామని రష్యా ఇది వరకే హెచ్చరిస్తోంది. అవసరమైతే అణ్వస్త్ర ప్రయోగానికి వెనుకాడబోమని రష్యా పదేపదే అమెరికా మిత్రదేశాలను మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది.
Also Read – జగన్‌కి ఓదార్పు కావాలి.. ఎవరైనా ఉన్నారా ప్లీజ్?
ఆ భయంతోనే ఇంతకాలం అమెరికా, మిత్రదేశాలు యుద్ధంలో నేరుగా పాల్గొనకుండా చాటుగా ఉక్రెయిన్‌కు సహాయసహకారాలు అందిస్తున్నాయి.
కానీ జో బైడెన్ అధ్యక్ష పదవిలో నుంచి దిగిపోయే ముందు రష్యాని కవ్వించే నిర్ణయం తీసుకొని అమెరికాకి యుద్ధం ముప్పు తెచ్చిపెట్టారని భావించవచ్చు.
Also Read – జగన్ 2.0: ఏపీకి, చంద్రబాబుకి మరింత కష్టమే!
తాను అమెరికా అధ్యక్షుడినైతే వారం పది రోజులలోగా అన్ని యుద్ధాలు నిలిపివేయిస్తానని డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కానీ ఆయన బాధ్యతలు చేపట్టేలోగానే అమెరికాపై రష్యా దాడికి ప్రయత్నిస్తే, అప్పుడు ట్రంప్ సైతం ఆ యుద్ధాన్ని కొనసాగించాల్సిందే తప్ప ఆపలేరు.
తాను దిగిపోతే డొనాల్డ్ ట్రంప్ నుంచి ఉక్రెయిన్‌కి ఎటువంటి సహాయ సహకారాలు లభించవనే ఉద్దేశ్యంతోనే జో బైడెన్ ఉక్రెయిన్‌కి ఈ వరం ప్రసాదించిన్నట్లు ఉన్నారు. కానీ అది చివరికి అమెరికా నెత్తినే పడే ప్రమాదం కనిపిస్తోంది. కనుక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టక ముందే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోక తప్పదేమో?