బీహార్‌లో బీజేపి, తెలంగాణలో కాంగ్రెస్‌ ఫిక్స్!

Congress likely to win Jubilee Hills bypoll as NDA leads in Bihar elections

మంగళవారం జూబ్లీహిల్స్, బీహార్‌ శాసనసభ రెండో దశ పోలింగ్ జరిగింది. బీహార్‌లో బీజేపి నేతృత్వంలో ఎన్డీయే, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించబోతున్నాయని సర్వే సంస్థలు జోస్యం చెప్పాయి.

నిన్న జరిగిన రెండో దశ పోలింగులో బీహార్‌లో 68.76 శాతం ఓట్లు నమోదు కాగా, జూబ్లీహిల్స్‌లో కేవలం 48.47 శాతం మాత్రమే నమోదైంది.

ADVERTISEMENT

బీహార్‌ శాసనసభ ఎన్నికలలో ఎన్డీయే కూటమి గెలిస్తే ఈసారి నితీష్ కుమార్‌ బదులు బీజేపి నుంచి ముఖ్యమంత్రి ఉంటారని ఎన్నికలకు ముందే రెండు పార్టీలు చూచాయగా చెప్పాయి.

బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి వలన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు జరిగాయి. కనుక ఈ సీటు తిరిగి దక్కించుకోవడం ఆ పార్టీకి చాలా అవసరం. ముఖ్యంగా కేటీఆర్‌ పూర్తి బాధ్యత తీసుకొని ఎన్నికల ప్రచారం, వ్యూహాలు అమలుచేశారు కనుక ఈ సీటు గెలుచుకుంటే ఆయనకే పూర్తి క్రెడిట్ దక్కుతుంది. ఒకవేళ ఓడిపోతే ఈ అప్రదిష్ట కూడా అయన పద్దులోనే జమా అవుతుంది.

ఒకవేళ సర్వే సంస్థలు చెపుతున్నట్లు ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల తర్వాత అంత భీకరంగాను జరిగిన ఈ ఎన్నికల యుద్ధంలో కూడా బీఆర్ఎస్‌ పార్టీని ఓడించిన ఘనత ఖచ్చితంగా సిఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఇంతకాలం కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత నెలకొని ఉందనే కేటీఆర్‌, హరీష్ రావుల వాదనలు అర్ధరహితం అవుతాయి.

దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల బీహార్‌ ఎన్నికల ఫలితాల గురించి ముందుగా సర్వే సంస్థలు ఏం చెప్పాయో తెలుసుకుందాం.

Bihar Jubilee hills Polling Survey

ADVERTISEMENT
Latest Stories