
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి తెలంగాణ బీజేపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటు అధ్యక్ష పదవి పై పెదవి విరుస్తూ ఈటెల రాజేంద్ర ప్రసాద్ వర్గం ఒక వైపు ఆందోళన చేస్తుంటే, మరోపక్క రాజాసింగ్ రాజీనామాకు సిద్ధమయ్యారు.
పార్టీ బలోపేతం కోసం సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న నా లాంటి వారిని సైతం పార్టీ అధిష్టానం పట్టించుకోకపోతే ఇక పార్టీ కోసం కష్టపడడంలో అర్ధం లేదంటూ “మీకో దండం మీ పార్టీకో దండం” అంటూ రాజా సింగ్ తన రాజీనామా లేఖను బీజేపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు.
Also Read – ఒకరు సస్పెండ్.. మరొకరు సస్పెన్స్.. అయినా తీరు మారలే!
బీజేపీ నాయకత్వ లోపం ఫలితంగానే తెలంగాణలో బీజేపీ ఎదగలేకపోతుందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే స్థాయికి అవసరమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని వెనక్కి నెడుతున్నాయంటూ బీజేపీ అధిష్టానం పై రాజా సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
టి. బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ నియామకం తనతో పాటుగా పార్టీ బలోపేతానికి కష్టపడుతున్న బీజేపీ కార్యకర్తలను సైతం భాదిస్తుందన్నారు. బీజేపీ లోని కొంతమంది నాయకులు పార్టీ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ పార్టీ బలహీనతకు పాల్పడుతున్నారంటూ
ఆరోపిస్తున్నారు.
Also Read – గుడివాడ ఫ్లెక్సీ వివాదం..
2014 నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ పార్టీని వీడలేదని, తనతో పాటు తన కుటుంబానికి ఉగ్రవాదులకు లక్ష్యంగా ఉన్నప్పటికీ కూడా పార్టీకి విధేయుడిగా ఉన్నందుకు పార్టీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ధన్యవాదాలు అంటూ రాజీనామా తో పార్టీ అధిష్టానానికి బదులు చెప్పారు రాజా సింగ్.