ఎదురులేని బిజెపి… ఢిల్లీ గద్దెపై కాషాయ జెండా..!

గత దశాబ్ద కాలంగా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ గద్దెనేలుతున్న భారతీయ జనతా పార్టీ, ముచ్చటగా మూడోసారి కూడా అధికారానికి చేరువైంది. మూడు కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు చురుకుగా సాగుతుండగా, మూడింటిలో ఘనమైన మెజారిటీ దిశగా బీజేపీ పరుగులు పెడుతోంది. అంతకుముందుతో పోలిస్తే… కాంగ్రెస్ పార్టీకి కాస్త మెరుగైన ఫలితాలను రాబట్టుకోగా, ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా విఫలమవ్వడం అనేది… అధికార ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించాలా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ADVERTISEMENT

ఇక, ఫలితాల విషయానికి వస్తే… ఉత్తర ఢిల్లీ పరిధిలోని 104 స్థానాల్లో 101 స్థానాల్లో ఫలితాలు వెలువడగా, బీజేపీ 65, కాంగ్రెస్ 17, ఆప్ 14, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. తూర్పు ఢిల్లీ పరిధిలో 64 స్థానాలకు గాను 63 స్థానాల్లో ఫలితాలు వెలువడగా, బీజేపీ 42, ఆప్ 11, కాంగ్రెస్ 7, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు. ఇక దక్షిణ ఢిల్లీ విషయానికి వస్తే, 104 స్థానాలకు గాను 102 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 63, ఆప్ 18, కాంగ్రెస్ 13 చోట్ల విజయం సాధించగా, ఇతరులు 8 చోట్ల గెలిచారు.

ADVERTISEMENT
Latest Stories