KCR

ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న పార్టీ తెరాస. అయితే విజయం అనే శిఖరం ఎక్కక మునుపు ఎన్ని అవరోధాలనైనా తట్టుకుని నిలబడగలిగిన పార్టీ ఒక్కసారి అధికారం అనే ఆయుధంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకున్న తరువాత ఒక్క ఓటమితో పార్టీ కుంగిపోయింది. కేసీఆర్ నిస్తేజంలోకి వెళ్లిపోయారు.

తన పార్టీ ఓటమికి తోడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, కూతురు కవిత అరెస్టు కూడా కేసీఆర్ ను మానసికంగా కుంగతీసింది. ఇన్నాళ్ళుగా ప్రతిపక్ష నేత పాత్రకు దూరంగా ఉంటూ పార్టీ శ్రేణులను నిరుత్సహంలో ఉంచిన కేసీఆర్, కవిత బైలు మీద తిరిగి ఇంటికి రావడంతో మళ్ళీ రాజకీయాలలో చురుకుగా పాల్గొని కాంగ్రెస్ పార్టీకి మంచి పోటీ ఇవ్వనున్నారు అనే వార్త బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉత్తేజ పరుస్తుంది.

Also Read – నమ్మలేం దొరా…!

అయితే ఇన్నాళ్ళుగా సైలేంట్ గా ఫామ్ హౌస్ లో కాలం వెళ్లబుచ్చిన కేసీఆర్ ఒక్కసారిగా ఏదోఒక బలమైన కారణం లేకుండా రాజకీయ వేదికల మీదకు రాలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ చేసే ఒక్క పొరపాటు కోసం, రేవంత్ తీసుకునే ఒక్క ప్రజా వ్యతిరేక నిర్ణయం కోసం కేసీఆర్ వేచి చూస్తున్నారు. ఆ నిర్ణయంతో తన రాజకీయ ఆటకు శ్రీకారం చుట్టి తిరిగి రాష్ట్ర రాజకీయాలలో తన మార్క్ రాజకీయం చూపించడానికి కేసీఆర్ తెర వెనుక కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం.

ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణామాఫీ హామీ మీద మల్లగుళ్లాలు పడుతుంది. 2 లక్షల లోపు రుణమాఫీ ఉన్న రైతులకు రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్ ఆ పైన రుణాలు తీసుకున్న రైతుల విషయంలో కాస్త జాప్యం పాటిస్తున్న మాట వాస్తవమే. కాబట్టి ఈ రైతు రుణమాఫీ తో రైతులలో సెంటిమెంట్ రాజేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతారా? లేక హైడ్రాతో ఆడలెత్తిస్తున్న రేవంత్ ను ఈ హైడ్రాతోనే చెక్ పెడతారా? అనేది తేలాల్సి ఉంది.

Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.

కవిత ఇంటికి రావడం కేసీఆర్ బయటకు వెళ్ళడానికి మార్గాన్ని సులభం చేసినట్లయింది. ఇన్నాళ్ళుగా కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి కాబట్టి మౌనంగా ఉండి పోయాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ గడువు ముగిసింది అంటూ కేసీఆర్ కథ మొదలు పెట్టవచ్చు. హైడ్రాతో రేవంత్ పేదల ఇళ్లను కూల్చి వారి బతుకులను రోడ్ల మీదకు తెస్తున్నారంటూ ఇప్పటికే బిఆర్థిస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె ప్రయత్నాలు మొదలు పెట్టింది.

తెలంగాణను బుల్డోజర్ రాజ్యంగా మార్చవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కు విజ్ఞపి చేసారు. అలాగే హైడ్రా అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లను కూలుస్తున్నారని, వారికి తిరిగి పునరావాసాన్ని కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అంటూ మరో బిఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ బాధితుల పక్షాన పార్టీ గొంతు వినిపించారు.

Also Read – AI విప్లవం – విజ్ఞానమా? వినాశనమా?

దీనితో ప్రభుత్వం పై జ్వజమెత్తడానికి కేసీఆర్ ఈ హైడ్రాను ఆయుధంగా మలచుకుంటారా అనే సందేహాలకు బలం చేకుతురుతుంది. ఇందులో భాగంగానే ముందుగా తన పార్టీ నేతల నుండి ఈ కూల్చివేతలను ఖండిస్తూ, బాధితులను తమ పక్షానికి తెచ్చుకోవడానికి కేసీఆర్ హైడ్రాను అస్త్రంగా చేసుకోబోతున్నారా? అంటే ‘ఉ’ అనే సమాధానమే వినపడుతుంది.