BRS Party Cadre Attacks Mahaa News Office

గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసారు అంటూ వైసీపీ శ్రేణులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై మీద దాడికి తెగబడ్డారు.

అయితే ఆ దాడిని ఖండించాల్సిన వైస్ జగన్ అందుకు విరుద్ధంగా నన్ను విమర్శిస్తే నా పార్టీ కార్తకర్తలకు బీపీలు రావా.? దాడులు చెయ్యరా.? అంటూ తిరిగి అప్పటి ప్రతిపక్ష టీడీపీ పార్టీ తో పాటు ప్రజలను ప్రశ్నించారు.

Also Read – భువి నుంచి దివికి ఒక తార.. దీవి నుంచి భువికి మరో తార!

అయితే నేడు సరిగ్గా అదే మాదిరి కేటీఆర్ అభిమానులు మహా న్యూస్ ఛానెల్ మీద దాడికి ఎగబడ్డారు. గత కొన్ని రోజులుగా మహా న్యూస్ ఛానెల్ లో ఫోన్ టాపింగ్ కేసు కు గాను కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో కథనాలు వెలువడుతున్నాయి.

దీనితో బిఆర్ఎస్ మద్దతుదారులు, కేటీఆర్ అనుచరులు సదరు మీడియా సంస్థ పై దాడికి దిగారు. హైద్రాబాద్ లోని మహా న్యూస్ కేంద్ర కార్యాలయం పై దాడులతో రెచ్చిపోయిన బిఆర్ఎస్ శ్రేణులు కార్యాలయం ఫర్నిచర్ ను ధ్వంశం చేసి, అక్కడ ఉన్న కారు అద్దాలను కూడా పగలకొట్టారు.

Also Read – మిథున్ రెడ్డి స్వామిభక్తి ప్రదర్శిస్తే పరవాలేదు కానీ..

దీనితో బిఆర్ఎస్ గుండాలు, కేటీఆర్ అనుచరులు పత్రికా స్వేచ్ఛను అణిచివేస్తున్నారు అంటూ సదరు మీడియా యజమాని మహా వంశీ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. అయితే బిఆర్ఎస్ శ్రేణుల దాడికి గాను కార్యాలయంలోని కొంతమంది సిబ్బందికి సైతం గాయాలయినట్టు వంశీ పేర్కొన్నారు.

అయితే ఇది ఇలా ఉంటే తన పై సదరు మీడియా ఛానెల్ ప్రచారం చేస్తున్న కథనాల పై స్పందించిన కేటీఆర్, ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కొందరు తనపైనా కావాలనే తప్పుడు ప్రచారాలను, అసత్య వార్తలను కథనాలు రూపంలో వండివస్తున్నారంటూ మండిపడ్డారు.

Also Read – బనకచర్లపై చర్చ వద్దట.. ఎందుకు?

ఇటువంటి నిరాధారమైన అసత్య వార్తల ప్రచారాలకు గాను సదరు ఛానెల్ మీద చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని, తన పై వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్న వారు ఎంతటివారైనా వదిలి పెట్టేదిలేదంటూ ఖరాకండిగా చెప్పారు కేటీఆర్.

అలాగే ఇటువంటి అసత్య వార్త ప్రచారాలతో తన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆవేదన చెందుతున్నారంటూ చెప్పుకొచ్చిన కేటీఆర్ పార్టీ శ్రేణులకు పరోక్ష సంకేతాలు పంపారా.? లేక పార్టీ శ్రేణులే కేటీఆర్ హెచ్చరికలను తమకిచ్చిన ఆదేశాలుగా భావించారో కానీ దాడులతో రెచ్చిపోయారు.

దీనితో బిఆర్ఎస్ కారకర్తలకు, కేటీఆర్ అనుచరులకు కూడా బీపిలొచ్చాయా.? అంటూ గత వైసీపీ శ్రేణుల బిపీలను గుర్తు చేసుకుంటున్నారు అయితే వీరి బిపీలకు కేటీఆర్ మద్దతు, బిఆర్ఎస్ అండ దొరుకుతుందా.? లేక రాజకీయాలలో ఇటువంటి దాడులకు స్థానం ఉండకూడదు అంటూ పార్టీ శ్రేణుల చర్యలను ఖండిస్తూ కేటీఆర్ తన అనుచరులను దారిన పెడతారా.?

ఇక మీడియా సంస్థల విషయానికొస్తే బ్రేకింగ్ న్యూస్ అంటూ హల్చల్ చెయ్యాలనో, స్పెషల్ బులెటిన్ అంటూ హడావుడి సృష్టించాలనో కాకుండా విచారణలో ఉన్న కేసు పై పూర్తి వివరాలు బయటకు రాకుండా ఇలా వ్యక్తిగత ఇమేజ్ ను దెబ్బ తీసేలా కథనాలు ప్రచారం చెయ్యడంలో కాస్త అత్యుత్సహం తగ్గించుకుంటే మంచిదనే భావన సర్వత్రా వినిపిస్తుంది.

ఏదిఏమైనా ప్రజాస్వామ్యంలో దాడులు అనేవి రాజకీయాలకే కాదు సమాజానికి అత్యంత హానికరం. ఈ రకమైన సంస్కృతీ ని అన్ని రాజకీయ పార్టీలు, అందరు రాజకీయ నాయకులు ఏకతాటి మీదకొచ్చి ముక్తకంఠంతో ఖండించాలి.