
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా ఆలోచింపజేస్తాయి. “తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఎంతగానో అభివృద్ధి చేస్తేనే ప్రజలు మనల్ని ఎన్నికలలో ఓడించారు. మరి ఏమీ చేయకుండా మాయ మాటలతో కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలని గెలిపిస్తారా?” అని ప్రశ్నించారు.
ప్రభుత్వం సమర్ధంగా పనిచేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, సంక్షేమ పధకాలు అందించాలని, నియోజకవర్గాలలో సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న కారణంగా ప్రజలు కోరుకున్నట్లు చేయలేకపోతోంది. కనుక కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని కేసీఆర్ సొంత అభిప్రాయమే చెప్పినా దానిలో ఎంతో కొంత వాస్తవం ఉంది.
Also Read – కాంట్రవర్సీ లో కీరవాణి?
కనుక ప్రభుత్వం, ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలలో అసంతృప్తి ఇంకా పెరిగితే అప్పుడు తప్పకుండా మళ్ళీ తమకే మొగ్గు చూపుతారని కేసీఆర్ నమ్మకంగా ఉన్నారు. సిఎం రేవంత్ రెడ్డికి, మంత్రులు, ఎమ్మెల్యేలకి ఈవిషయం తెలియదనుకోలేము.
కానీ తమ పాలనతో ప్రజలు సంతృప్తి చెందారని, రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నామని, అన్ని సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నామని చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తే చివరికి నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి మంత్రి పదవులు అనుభవిస్తున్నవారే!
Also Read – మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా?
కనుక వీలైనంత త్వరగా ఈ సమస్యల ఊబిలో నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటపడలేకపోతే అప్పుడు కేసీఆర్ చెప్పిందే జరుగుతుంది.