Caravan Tourism in Andhra Pradesh

సిఎం చంద్రబాబు నాయుడు, యోగా గురు బాబా రామ్‌దేవ్‌తో కలిసి నేడు విజయవాడలో జరిగిన ‘టూరిజం కాన్‌క్లేవ్’ కార్యక్రమంలో ‘కార్వాన్’ వాహనాలకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

ఇంతకాలం విలాసవంతమైన ‘కార్వాన్’ వాహనాలు అగ్ర సినీ నటులు వద్ద మాత్రమే ఉండేవి. ఆ తర్వాత క్రమంగా రాజకీయ నాయకులతో సహా వివిద రంగాల ప్రముఖులు కూడా ‘కార్వాన్స్’ వినియోగిస్తున్నారు.

Also Read – రాజకీయాలలో మెట్టు దిగడం.. ఇలా కాదు!

అయితే నేటికీ ఈ కార్వాన్లు ఉన్నత ఆదాయ వర్గానికి కూడా అందుబాటులో లేవు. కనుక సామాన్య ప్రజలు వాటి గురించి ఆలోచించలేరు కూడా. కనుక రాష్ట్రంలో లేదా ఇరుగు పొరుగు రాష్ట్రాలలో పర్యాటక ప్రదేశాలకు రైళ్ళు, బస్సులు, విమానాలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో వెళ్ళివస్తున్నారు.

నేటికీ దేశంలో, రాష్ట్రంలో మద్యతరగతి, దిగువ మధ్య తరగతి, నిరుపేదలు కోట్ల మంది ఉన్నమాట ఎంత వాస్తవమో, సౌకర్యాల కోసం ఖర్చుకి వెనకాడనివారు కోట్ల మంది ఉన్నారు. వందే భారత్ రైళ్ళు, రైళ్లలో ఫస్ట్, సెకండ్ క్లాస్‌లలో, వోల్వో బస్సులలో ప్రయాణించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం.

Also Read – వైసీపీ PHD లు ఎన్నో ఎన్నెన్నో.?

కనుక పర్యాటక శాఖ ప్రవేశపెడుతున్న ఈ కార్వాన్ వాహనాలకు కూడా బుకింగ్స్ బాగానే ఉండవచ్చు. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే ఏపీ పర్యాటక రంగంలో మలుపు తిరుగుతుంది.

దీనిలో ఏసీ, మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబిల్, మినీ కిచెన్, వైఫై, టీవీ, టాయిలెట్ వంటి సకల సౌకర్యాలు ఉంటాయి. కనుక ఓ కుటుంబం లేదా బంధుమిత్రులు కలిసి ఈ కార్వాన్లలో పర్యాటక ప్రదేశాలకు హాయిగా వెళ్ళి రావచ్చు.

Also Read – లేని వారి కోసం పోస్టులు..ఉన్న వారి పై కేసులా..?


ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ కార్వాన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కనుక త్వరలోనే దీని బుకింగ్, రూట్ మ్యాప్ తదితర వివరాలు ఖరారు చేసి ప్రకటించనుంది.