Cases on KTR is Profit to BRS Party

పోలీస్ కేసులంటే భయపడే రోజుల నుంచి కేసులంటే రండి అరెస్టు చేసుకోండి అనే స్థాయికి చేరుకున్నారు రాజకీయ నాయకులు. వీరిలో ఈ ధైర్యాన్ని నూరిపోసింది మాత్రం ప్రజలనే చెప్పాలి.

ఒక ప్రముఖ రాజకీయ వేత్త పోలీస్ కేసులతో అరెస్టయితే ఇక ఆ నాయకుడికి రాష్ట్రంలో తిరుగుండదు అనేలా ఆయన స్థానాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో చేరుస్తున్నారు ఓటర్లు. జైలుకెళితే పదవి గ్యారెంటీ అనేలా పరిస్థితులు మారిపోయాయి.

Also Read – దావోస్‌లో కూడా ఏపీ, తెలంగాణ మద్య పోటీ.. తప్పదా?

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బిఆర్ఎస్ పార్టీ పై ఏమేరకు ప్రభావం చూపనుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందాలోచన చేసుకోవాలి. ఇప్పటికే కేసీఆర్ కుటుంబం నుంచి ఆయన కుమార్తె కవిత లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి దాదాపు ఆరు మాసాలు జైలు జీవితం గడిపి బెయిలు మీద బయటకొచ్చారు.

ఇప్పుడు కేటీఆర్ అరెస్టు కు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన మౌనాన్ని వీడి ప్రజా క్షేత్రం లోకి అడుగుపెడితే ఇక ఆ తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎలా మారనున్నాయి అనేది ఇక్కడ కీలకాంశంగా మారింది. కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడు తిరిగి ప్రభుత్వం మీద పోరాటం మొదలు పెడితే దాని స్థాయి ఏమేరకు ఉంటుందో సీఎంగా ఉన్న రేవంత్ అనుభవం ఇప్పుడే అంచనా వెయ్యలేకపోవచ్చు.

Also Read – అంతరిక్షంలో ఇస్రో స్పేస్ స్టేషన్… మరెంతో దూరం లేదు!

కూతురు కవిత కేసులు, అరెస్టు విషయంలో మౌనంగా ఉన్న కేసీఆర్, కేటీఆర్ విషయంలో కూడా అదే మౌనాన్ని ఆశ్రయిస్తారా అంటే సందేహమే. అయితే ఇప్పటి వరకు ఎవరు ఊహించని విధంగా కేసీఆర్ మాత్రం కేటీఆర్ కేసుల విషయంలో అటు తెలంగాణ ప్రజలకు గాని ఇటు బిఆర్ఎస్ శ్రేణులకు గాని ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు కూడా రేవంత్ సర్కార్ పై పోరాటం చేసేందుకు కేటీఆర్ కు మద్దతు తెలిపేందుకు పార్టీ పెద్దగా హరీష్ రావు ముందుకొస్తున్నారు.




అయితే తన అవినీతి కేసుల నుండి కేటీఆర్ ను తప్పించడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలు కేటీఆర్ అరెస్టు సూచిస్తున్నాయి. ఒక వేళ ప్రభుత్వం అనుకున్నట్టుగా కేటీఆర్ అరెస్టు జరిగితే అది బిఆర్ఎస్ పై ఏమేరకు ప్రభావం చూపుతుంది.? ఆ అరెస్టు ప్రభావముతో ప్రజలలో బిఆర్ఎస్ పట్ల సానుభూతి వస్తుందా.? లేక అక్రమాలకు పాల్పడ్డారు మాజీ మంత్రి అంటూ బిఆర్ఎస్ మీద మరింత ద్వేషం పెరుగుతుందా.?

Also Read – అభివృద్ధి అంటే ఇదే కదా జగన్‌ మావయ్యా?