నాడు జగన్ ను నమ్మి వైసీపీ బాధ్యతను భుజాన మోసిన సొంత కుటుంబ సభ్యులైనా తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల నేడు జగన్ బాధితులుగా మిగిలారు. అలాగే జగన్ బాటలోనే మేము అంటూ ముందుకొచ్చిన కొంతమంది సినీ సెలబ్రేటిస్ ఆలీ, పృథ్వి రాజ్, కథ రచయిత చిన్ని కృష్ణ, పోసాని, ఆర్జీవీ, మంచు మోహన్ బాబు, మహి వీ రాఘవ్ వంటి వారు వైసీపీ బాధితులుగా మిగిలిపోయారు.
చైల్డ్ ఆర్టిస్టుగా చిత్ర పరిశ్రమకు పరిచమైన ఆలీ తన సినీ కెరీర్ లో ఎన్నో వందల సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించి, చివరికి జగన్ రాజకీయ నటన ముందు తలవంచారు. వైసీపీ జెండాతో, జగన్ నాయకత్వంలో తన రాజకీయ జీవితం ఒక మంచి మలుపు తిరుగుతుంది అని ఆశించిన ఆలీని చివరికి రాజకీయ ఆటలో అరటిపండు మాదిరి చైల్డ్ ఆర్టిస్టుగా మలిచి తిరిగి వెనక్కి పంపించారు జగన్.
ఇక 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ జబ్బలు చరుచుకున్న కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వి రాజ్ వైసీపీ కండువా భుజాన వేసుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసి చివరికి జగన్ ఆడిన రాజకీయ చదరంగంలో క్యారెక్టర్ లెస్ వ్యక్తిగా ముద్ర వేయించుకుని బయటకొచ్చారు. అలాగే ఇంద్ర సినిమా కథ రచయితగా ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్ని కృష్ణ జగన్ ను నమ్మి అన్నం పెట్టిన చేతికే సున్నం రాసాడు.
రచయితగా జగన్ కు మద్దతు పలికిన చిన్ని కృష్ణ 2019 ఎన్నికల ముందు చివరకు వీధి రౌడీలా ప్రవర్తించారు. విలక్షణ నటుడిగా, నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన మంచు మోహన్ బాబు కూడా 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, బాబు పై నిప్పులు చెరుగుతూ జగన్ పంచన చేరారు. తండ్రి బాటలోనే ఆయన పెద్ద తనయుడు మంచు విష్ణు కూడా బావ అంటూ జగన్ జెపం చేసారు.
కట్ చేస్తే, 2024 నాటికి మంచు కుటుంబం పేరు అటు రాజకీయాలోనే కాదు ఇటు సినీ రంగం నుండి కూడా దాదాపు కనుమరుగయిపోయింది. విలన్ నుండి హీరోగా ఎదిగిన ఈ కుటుంబం సినీ ప్రస్థానాన్ని చివరికి కామెడీగా మార్చేశారు జగన్. ఇక పోసాని, ఆర్జీవీ గురించి చెప్పనవసరం లేదు అనుకుంటా. ఒకప్పుడు వారిని చూడడానికి ఎదురు చూసే ప్రజలు ఇప్పుడు వారు కనపడితే అసహ్యించుకునే స్థాయికి పడిపోయారు.
యాత్ర -1,యాత్ర – 2 అంటూ తన తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రస్థానం నుండి మొదలు పెట్టి తన పాదయాత్ర వరకు తన వైసీపీ పార్టీకి అవసరమైన సమయంలో సినిమాలు తీసి వెండి తెర మీద వైస్ కుటుంబాన్ని ఒక హీరోలు మాదిరి చిత్రీకరించిన దర్శకుడు మహి వీ రాఘవ్ జగన్ ను నమ్మి తన సినీ కెరీర్ ను ఒక దారి తెన్నులేని ప్రయాణంలా చేసుకున్నారు. దర్శకుడిగా పరిచమైన మహి వైసీపీ దరిద్రంలో కనుమరుగయ్యారు.
అయితే చివరికి వీరంతా కూడా తమ తప్పు తెలుసుకుని వైసీపీకి గుడ్ బై చెప్పి జగన్ కు దూరంగా, జన జీవన స్రవంతికి దగ్గరా వచ్ఛేసారు. ఇందులోఒక్క పృథ్వి తప్ప మిగిలినవారంతా కూడా రాజకీయాలకు మాకు ఎటువంటి సంబంధం లేదని రాజకీయాలకు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారు. దీనితో వైసీపీ జెండా పట్టుకోకముందు వరకు సాఫీగా సాగిపోయిన వారి సినీ ప్రస్థానానికి కూడా ఇక ఇక్కడితో ఎండ్ కార్డు పడినట్లయింది.
దీనితో అటు చిత్ర పరిశ్రమకు దూరమై, ఇటు రాజకీయ సన్యాసం చేస్తూ జగన్ ఆడిన రాజకీయ క్రీడలో బలిపశువులయ్యారు ఈ సో కాల్డ్ సెలబ్రేటిస్. అలాగే అన్నను నమ్మి తన రాజకీయ భవిష్యత్ ను కూడా పట్టించుకోని షర్మిల చివరికి అదే జగన్ నుండి కేసులు ఎదుర్కొంటు జగన్ బాధితురాలిగా మిగిలిపోయారు.




