chandrababu calls to boycott ntv tv9టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ ఛానల్స్ టీవీ9, ఎన్‌టీవీలను బహిష్కరించవలసిందిగా టిడిపి శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రాణాలు పణంగా పెట్టి జగన్ ప్రభుత్వం అవినీతిపై పోరాడుతుంటే ఆ రెండు న్యూస్ ఛానల్స్ అధికార వైసీపీకి చెందిన ఓ మీడియా సంస్థతో కుమ్మక్కై తెలుగుదేశం పార్టీమీద విషప్ర’చారం చేస్తున్నాయని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సంస్థలు ఈవిదంగా అన్యాయాలకు, అక్రమాలకు కొమ్ముకాస్తూ ప్రతిపక్ష పార్టీని అప్రదిష్టపాలు చేసేందుకు పనిగట్టుకొని విష ప్రచారం చేస్తుండటం చాలా బాధాకరం అని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఇటీవల అమిత్‌ షా హైదరాబాద్‌ వచ్చినప్పుడు జూ.ఎన్టీఆర్‌తో భేటీ కావడంపై, కుప్పంలో అన్నా క్యాంటీన్‌ల రగడపై ఈ రెండు న్యూస్ ఛానల్స్ టిడిపి ప్రతిష్టకి భంగం కలిగేలా, రాజకీయంగా ఇబ్బంది కలిగేవిదంగా కధనాలు ప్రసారం చేశాయి. అంతకు ముందు కోనసీమ అల్లర్లలో కూడా టిడిపి హస్తం ఉందన్నట్లు కధనాలు ప్రసారం చేశాయి.

నిజానికి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టిడిపి వేధింపులు భరిస్తోంది. ఈ మూడున్నరేళ్ళలో అనేక మంది టిడిపి కార్యకర్తలు హత్య చేయబడ్డారు. టిడిపి అగ్రనేతలు పోలీసుల వేధింపులకు గురవుతున్నారు. వారి ఆర్ధిక మూలాలను వైసీపీ దెబ్బ తీస్తోంది. వారి ఇళ్ళు కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. నయన్నో, భయాన్నో టిడిపి నేతలను, కార్యకర్తలను లొంగదీసుకొనేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

అయినప్పటికీ వారు ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా వైసీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలను, అనాలోచిత నిర్ణయాలను ప్రశ్నిస్తూ గట్టిగా పోరాడున్నారు. కనుక వైసీపీ దౌర్జన్యాలకు బలవుతూ పోరాడుతున్న టిడిపి పట్ల సానుభూతి చూపకపోగా, నీలి మీడియాతో కుమ్మకై ఆ రెండు న్యూస్ ఛానల్స్ టిడిపిపై విష ప్రచారం చేస్తున్నాయని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే టీవీ9, ఎన్‌టీవీలను బహిష్కరించవలసిందిగా టిడిపి శ్రేణులకు, ప్రజలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Watch and subscribe for Exclusive Interviews: