బాబు బెయిలు పిటిషన్: ఈసారి వాయిదాకు సాకు దొరికింది.!

Chandrababu-Naidu-High-Court

స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాలుగు వారాల మధ్యంతర బెయిలు మీద బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిలు పొందడానికి హైకోర్టులో పిటిషన్ వేయడం, న్యాయస్థానం దానిని వాయిదా వేయడం జరిగింది.

ఈ రోజు హై కోర్టులో విచారణ జరగాల్సిన స్కిల్ కేసు విచారణకు ప్రభుత్వ అదనపు ఏజీ హాజరు కాలేదనే కారణంగా తమకు మరింత సమయం కావాలని, విచారణను వాయిదా వేయాలని ఏపీ సీఐడీ పిపి వివేకానంద న్యాయస్థానాన్ని కోరగా అందుకు హై కోర్ట్ న్యాయమూర్తి ఈ నెల 15 వ తేదికి ఈ కేసు విచారణను వాయిదా వేశారు.

ADVERTISEMENT

సీఐడీ అధికారులు కేసు విచారణకు వచ్చిన ప్రతి సారి ఏదోఒక కారణంతో విచారణను వాయిదాలతో కాలయాపన చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. అన్ని ఆధారాలు సేకరించిన తరువాతనే బాబుని అరెస్టు చేయడం జరిగిందంటూ పదేపదే చెపుతున్న అధికారులు ఇలా వాయిదాలతో విచారణను నెట్టుకురావడం అనుమానాలను బలం చేకూరుస్తుంది.

అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందకీ వెంటనే న్యాయస్థానాలలో కొంత ఊరట దక్కింది. కానీ చంద్రబాబు మాత్రమే సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన తరువాతనే ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిలు సాధించగలిగారు.అయితే ఇప్పుడు కూడా సీఐడీ అధికారులు విచారణలో వాయిదాలనే నమ్ముకుంటే, చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ వేధింపులే ఈ కేసుకి కారణాలు అంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ప్రభుత్వమే ఆధారాలు చూపినట్లవుతుంది.

ADVERTISEMENT
Latest Stories