చంద్రబాబుకు తప్పిన ప్రమాదం… అసలేం జరిగింది..!

chandrababu-naidu-bus-accidentఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ ప్రమాదం నుండి బయటపడ్డారు. విజయవాడ, గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు, అక్కడ నుంచి తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన ఓపీడీ బ్లాక్ ను ప్రారంభించడానికి బస్సులో బయల్దేరారు.

అయితే, బస్సు అవిలాలకు చేరుకోగానే, ఇంజిన్ లో నుంచి పొగలు వచ్చి బస్సు నిలిచిపోయింది. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై, మరో వాహనంలో అక్కడ నుంచి తరలించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.

ADVERTISEMENT

గతంలో ఇదే చిత్తూరు జిల్లా, అలిపిరి వద్ద ఓ పెనుప్రమాదం నుండి బయటపడిన విషయం తెలిసిందే. మళ్ళీ అదే చిత్తూరు జిల్లాలో మరో ప్రమాదం నుండి బయటపడడం విశేషం. అలాగే చంద్రబాబు సొంత జిల్లా కూడా చిత్తూరు కావడం అసలు విషయం.

ADVERTISEMENT
Latest Stories