ఈరోజు శాసనసభలో సిఎం చంద్రబాబు నాయుడు ‘స్వర్ణాంద్ర ప్రదేశ్-2047’ విజన్ డాక్యుమెంట్‌పై జరిగిన చర్చలో మాట్లాడుతూ కొన్ని చేదు నిజాలు, శాసనసభ్యులకు కొన్ని హితోక్తులు చెప్పారు.
చాలా మంది రాజకీయ నాయకులకులేని దూరదృష్టి సిఎం చంద్రబాబు నాయుడుకి ఉంది. అందువల్లే ఆయన ఇదివరకు ముఖ్యమంత్రి అయినప్పుడే ‘స్వర్ణాంద్ర ప్రదేశ్-2047’ గురించి మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ చెపుతున్నారు.
Also Read – ఎఫ్-1 కేసు: సుప్రీంకోర్టు సింపుల్‌గా తేల్చేసింది!
2047 ఎందుకంటే, అప్పటికి మన దేశానికి వంద సంవత్సరాలు పూర్తవుతుంది. కనుక అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థాయిలో, ఏవిదంగా ఉండాలనేది సిఎం చంద్రబాబు నాయుడు ఊహించి, అందుకు తగ్గ ప్రణాళికలు రచించి అమలుచేస్తూ, తన విజన్ గురించి అందరికీ అర్దమయ్యేలా చెపుతున్నారు.
‘స్వర్ణాంద్ర ప్రదేశ్-2047’ అంటే ఏదో బ్రహ్మపదార్ధం కాదని, క్లుప్తంగా ‘వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ అని సిఎం చంద్రబాబు నాయుడు అందరికీ అర్దమయ్యేలా వివరించారు. రాష్ట్రాభివృద్ధితోనే ఈ మూడు సాధ్యమవుతాయని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
Also Read – ఆర్జీవీ…’మెగా’ సెటైర్స్..!
బహుశః నేటికీ చాలా మంది మంత్రులకి, ఎమ్మెల్యేలకి, రాజకీయ నాయకులకి ఆయన చెపుతున్న ఈ ‘స్వర్ణాంద్ర ప్రదేశ్-2047’ విజన్ డాక్యుమెంట్ అర్ధం కాకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడుకి దానిపై పూర్తి స్పష్టత ఉంది కనుక ఆ దిశలో రాష్ట్రాన్ని నడిపిస్తూ అందరినీ నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సందర్భంగా 5 ఏళ్ళ జగన్ పాలనలో జరిగిన విధ్వంసాల గురించి వివరించి, రాష్ట్రంలో ఇటువంటి అరాచక పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏ పెట్టుబడిదారుడు, పారిశ్రామికవేత్త ముందుకు రాడని, ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించడమే పెద్ద పనైపోయిందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
Also Read – మీడియా వారు జర భద్రం…!
కనుక మన ప్రభుత్వం, ప్రజలు కలిసి అటువంటి సహృధ్భావ వాతావరణం సృష్టించాలని సిఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు.
“ఇదివరకు మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయామే తప్ప ఇటువంటి అరాచక పరిస్థితులు వస్తాయని ఊహించలేదు. కానీ ఇప్పుడు అవి కూడా కళ్ళారా చూశాము. కనుక రాష్ట్రంలో మళ్ళీ అటువంటి అరాచక పరిస్థితులు, వాటిని సృష్టించే పార్టీలు అధికారంలోకి రాకుండా అడ్డుకునే బాధ్యత ప్రజలపై కూడా ఉందనే విషయం ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలకు వివరిస్తూ, వారిని ఎప్పటికప్పుడు చైతన్య పరచాలని సిఎం చంద్రబాబు నాయుడు హితవు పలికారు.
తాను ఏవిదంగా రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రణాళికలు రచించుకుంటున్నానో, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా తమ తమ జిల్లాలను, నియోజకవర్గాలని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకునేందుకు, జిల్లా అధికారులతో కలిసి ప్రణాళికలు రచించుకొని అమలుచేస్తూ ప్రజల ఆదరణ పొందాలని సిఎం చంద్రబాబు నాయుడు హితవు పలికారు.
జగన్ హయాంలో శాసనసభ సమావేశాలలో నిత్యం చంద్రబాబు నాయుడుని విమర్శించడానికి లేదా జగన్ భజనతోనే సరిపోయేది.
శాసనసభ సమావేశాలు లేనప్పుడు కూడా ఇదే తంతు. అభివృద్ధిని విస్మరించి సంక్షేమ పధకాలు భుజానికి ఎత్తుకోవడమే పెద్ద తప్పు అనుకుంటే, రాజకీయ కక్ష సాధింపులతోనే 5 ఏళ్ళు కాలక్షేపం చేయడం ఇంకా పెద్ద తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అత్యంత అమూల్యమైన 5 ఏళ్ళ కాలాన్ని జగన్ దుర్వినియోగం చేయడం క్షమించరాని నేరమే… కదా?