హస్తినలో మోడీ గాలి తీసేసిన చంద్రబాబు!

NArendra Modi - Chandrababu Naidu-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రెండో రోజు ఢిల్లీ టూరులో భాగంగా జాతీయ మీడియాతో ఒక సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వివరించారు. అంశాల వారీగా తయారు చేసిన ప్రెజెంటేషన్ ను వారికి తెరపై చూపించి అన్ని విపులంగా వివరించారు చంద్రబాబు.

ఇదే సంధర్భంగా నెల్లూరు ఎన్నికల సభలో, అమరావతి శంకుస్థాపన సభలో ప్రధాని స్వయంగా ఇచ్చిన హామీల వీడియోలను ప్లే చేసి మరి చూపించారు. మొట్టమొదటి సారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్ర సమస్యల గురించి హస్తినలో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం. అదే విధంగా ఒక పుస్తకం కూడా అచ్చు వేసి వచ్చిన వారికి పంపిణీ చేశారు.

ADVERTISEMENT

ఇటీవలే అసెంబ్లీలో కూడా ఇవే వీడియోలు చూపించారు. ఇదే సంధర్భంలో మోడీ ఆస్తానా వెళ్ళి అక్కడి రాజధాని చూసి రమన్న విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. 1500 కోట్లతో ఆస్తానా లాంటి రాజధానిని ఎలా కట్టాలని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన ఈ పని మోడీకి ఆగ్రహం తెపించినట్టు సమాచారం. దీనితో మరొక రౌండు కక్షసాధింపు చర్యలకు టీడీపీ సిద్ధం కావల్సిరావొచ్చు.

ADVERTISEMENT
Latest Stories