
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దేశ ప్రజలు ఆంధ్రప్రదేశ్ గురించి చాలా చెప్పుకునేవారు. ఆంధ్రాలో గుంతలు పడిన రోడ్లు, నెలనెలా జీతాల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ధర్నాలు చేస్తుండటం, మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు డ్యూటీలు వేయడం వంటివాటి గురించి చెప్పుకునే వారు.
ప్రభుత్వాస్తులు తాకట్టుపెట్టడం, అప్పులు తెచ్చి సంక్షేమ పధకాలు అమలుచేస్తుండటం, మూడు రాజధానులు, రుషికొండ ప్యాలస్.. ఇలా ఒకటేమిటి అనేకం చెప్పుకుని పగలబడి నవ్వుకునేవారు.
Also Read – జగన్ ఆలోచింపజేయగలుగుతున్నారు మరి కూటమి నేతలు?
అప్పుడు పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ మంత్రులు తమ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, తమ పాలన గురించి గొప్పగా వర్ణించుకోవడానికి దయనీయ పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని, జగన్ పాలనని చూపిస్తుండేవారు. అయినా జగన్ ఏమాత్రం సిగ్గుపడలేదు.
అంటే జగన్ రాష్ట్రాన్ని, వ్యవస్థలని నాశనం చేయడమే కాకుండా రాష్ట్రం పరువు కూడా పూర్తిగా తీసేశారన్న మాట! అందుకు ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. కనుక పశ్చాత్తాప పడలేదు కూడా. నేటికీ తన పాలన నభూతో నభవిష్యత్ అని నిసిగ్గుగా చెప్పుకుంటూనే ఉన్నారు.
Also Read – మంగళగిరి మొనగాడెవరు.?
ఇటువంటి దయనీయ పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సిఎం చంద్రబాబు నాయుడు కేవలం ఏడాదిలోనే మళ్ళీ గాడిలో పెట్టడమే కాకుండా, ఇప్పుడు యావత్ దేశ ప్రజలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకునేలా చేశారు.
అమరావతి, పోలవరం, భోగాపురం విమానాశ్రయం, మరో అరడజను విమానాశ్రయాలు, వైజాగ్, విజయవాడలో మెట్రో, పరిశ్రమలు, పెట్టుబడులు, ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్, డ్రోన్ పరిశ్రమలు.. ఇలా ఒకటా రెండా..
Also Read – బీజేపీ వాదానికి మూడు పార్టీల మద్దతు…
ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్రంలో.. అదే బిఆర్ఎస్ పార్టీ నేతలు.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోమని తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెపుతున్నారు!
తమ హయంలో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేవని కానీ ఇప్పుడు అన్నీ ఆంధ్రాకి, అమరావతికి వెళ్ళిపోతున్నాయని వాపోతున్నారు!
ఒక్క ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల దేశ ప్రజల, పెట్టుబడిదారుల అభిప్రాయాలు ఎలా మారాయి? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఇంతగా ఎలా పెరిగింది?అంటే సమాధానం అందరికీ తెలుసు. సిఎం చంద్రబాబు నాయుడు!
రేపు విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను రప్పించడం ద్వారా యావత్ దేశ ప్రజలు మరోసారి ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకునేలా చేశారని చెప్పవచ్చు.
ఈ కార్యక్రమం కోసం ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు బీజేపి పాలిత రాష్ట్రాలను కాదని ఏపీకి తరలివెళుతుండటంతో అసలు ఏపీలో ఏం జరుగుతోంది?అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ప్రధాని మోడీ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందున జాతీయ, అంతర్జాతీయ మీడియాలో విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ గురించి వార్తలు తప్పక వస్తాయి.
ఇటీవల హైదరాబాద్ మిస్ వరల్డ్ 2025 పోటీలు జరిగినప్పుడు ఏవిదంగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం పేరు యావత్ ప్రపంచదేశాలలో మారుమ్రోగిపోయిందో, రేపు విశాఖలో జరుగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంతో కూడా ఆదేవిదంగా విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ పేరు కూడా మారుమ్రోగుతుంది.
జగన్ ఆంధ్రా పరువు తీసేస్తే, సిఎం చంద్రబాబు నాయుడు దానిని కూడా ఏడాదిలోనే ఈవిదంగా పునరుద్దరించడం చాలా గొప్ప విషయమే కదా?