క్రెడిటే లేనప్పుడు చోరీ ఎలా?

సిఎం చంద్రబాబు నాయుడు చురకలు వేస్తే మామూలుగా ఉండవు. వాతలు పడతాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అలాగే చురకలు వేశారు. మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ, “మనకి క్రెడిట్ అంటూ ఒకటి ఉంటే దానిని ఎవరైనా దొంగిలించగలరు. కానీ అసలు ఎటువంటి క్రెడిట్‌ లేని జగన్‌ నుంచి క్రెడిట్ చోరీ ఎలా సాధ్యం.

మా క్రెడిట్ హైటెక్ సిటీ, అమరావతి, కియా, భోగాపురం విమానాశ్రయం ఇంకా చాలానే ఉన్నాయి. కానీ జగన్‌కి ఏమున్నాయి? బాబాయ్ గొడ్డలి వేటు, ల్యాండ్, శాండ్, వైన్ స్కాములే కదా? ఆ క్రెడిట్ మాకెందుకు మీ దగ్గరే ఉంచుకోండి.

ADVERTISEMENT

మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా రాజధాని కట్టలేకపోయారు. భోగాపురం విమానాశ్రయం పూర్తిచేయలేకపోయారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ, ఐటి కంపెనీని తేలేకపోయారు. అయినా క్రెడిట్ చోరీ అంటూ మాట్లాడుతుంటే జనాలు నవ్వుకుంటున్నారని కూడా తెలుసుకోకపోతే ఎలా?

నేను ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారు. అయితే మీ బెంగళూరు, ఇడుపులపాయ ప్యాలస్‌లే ఏపీకి రాజధానులా? అమరావతి పాడుబెట్టి మూడు ముక్కలాట ఆడారు గాబట్టే ప్రజలు మిమ్మల్ని గద్దె దించారు. అయినా అమరావతి పేరుతో నీచ రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. కనుక మళ్ళీ ప్రజలే మీకు తగిన విధంగా బుద్ధి చెపుతారు.

ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కొరకు టీడీపిని స్థాపిస్తే, జగన్‌ అక్రమాస్తుల అవినీతి సొమ్ముతో పదవి అధికారం కోసం వైసీపీని స్థాపించారు. రాష్ట్రంలో క్రిమినల్ మైండ్స్ ఉన్నవారందరూ మీ అవినీతి పార్టీలో చేరారు.రాజకీయ ముసుగులో వచ్చిన ఇలాంటి అవినీతి పార్టీతో మేము రాజకీయ పోరాటాలు చేయాల్సి వస్తుండటం దురదృష్టకరం!

మీకు రౌడీఇజం చేయడం అలవాటు కావచ్చు. కానీ రాష్ట్రంలో రౌడీఇజం చేస్తానంటే చూస్తూ ఊరుకోను. మేం తలుచుకుంటే ఏం చేయగలమో ఈ 18 నెలలో రుచి చూపించాము కదా?

మీ కార్యకర్తలు రప్పారప్పా అంటే రోడ్లపై కోళ్ళు, గొర్రెలు నరుకుతూ ప్రజలను భయపెడుతుంటే, మా కార్యకర్తలు అవసరమైతే పార్టీ కోసం ప్రాణాలు కూడా వదిలేస్తారు. మీ పార్టీకి మా పార్టీకి ఇదే తేడా,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

ADVERTISEMENT
Latest Stories