ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాలు ఆడుతున్నారని, మోసం చేస్తున్నారని విపక్ష నేత జగన్ తన పాదయాత్రలో విమర్శిస్తే చంద్రబాబు దానిపై స్పందించకుండా తేలిగ్గా తీస్కున్నట్టు సమాచారం. జగన్ పాదయాత్రపై అతిగా స్పందించవద్దని సహచరులకు చెప్పినట్టు సమాచారం.
ప్రజా సమస్యలపై మాట్లాడకుండా తనపై నిందారోపణలు చేస్తే ప్రయోజనం సూన్యం అని ఆయన అభిప్రాయపడ్డారట. పాదయాత్రలు చేసే నాయకుల నుంచి ప్రజలు ఇవి ఆశించరని, వారి సమస్యల గురించి ప్రస్తావించాలనుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది
జగన్ వ్యవహారశైలి అందుకు భిన్నంగా ఉందని కూడా ఆయన అన్నారు. మరోవైపు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి పిరాయించిన వారందరితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని విపక్ష నేత సవాల్ చేశారు. ఆ మాట కొందరు ప్రస్తావించగా నంద్యాల ఉపఎన్నికలో ఏం జరిగిందో అందరు చూసారు కదా అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు సమాచారం.





