రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే ఎక్కువ పెట్టుబడులు

Chandrababu Naidu Promotes Investments in Andhra Pradeshకేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక ఆధారంగా పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో ఉంది దేశం వ్యాప్తంగా. కేవలం కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర మాత్రమే ఆంధ్రప్రదేశ్ కంటే ముందు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కంటే వెనుక ఆరవ స్థానంలో ఉన్నది.

ADVERTISEMENT

హైదరాబాద్ లాంటి గ్రోత్ ఇంజిన్ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ పెట్టుబడులు సాధించడం వెనుక ఆ రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి ఉందని చెప్పక తప్పదు. ఈ సంవత్సరం జనవరి నుండి సెప్టెంబర్ వరకు కర్ణాటక 1,47,625 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకుంది.

దేశం మొత్తం మీద వచ్చిన ఎంఓయూలలో ఇవి 44%. గుజరాత్ 65,741 కోట్లు, మహారాష్ట్ర 25,018 కోట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నవి. నాలుగవ స్థానంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ 24,013 కోట్ల పెట్టుబడులు సాధించింది. తెలంగాణ 12,567 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ కంటే ముందు ఉన్న కర్ణాటక, గుజరాత్, మరియు మహారాష్ట్ర పారిశ్రామికంగా ముందంజే లో ఉన్నాయి. అలాగే ఆ రాష్ట్రాలన్నీ మిగులు బడ్జెట్ రాష్ట్రాలు. ఈ ఎంఓయూలు రూపుదాల్చకపోయినా, రూపుదాల్చడానికి ఎక్కువ సమయం పట్టిన అన్ని రాష్ట్రాలకు అదే పరిస్థితి ఉండడంతో ఈ ర్యాంకులు ఇలాగే ఉండవొచ్చు.

ADVERTISEMENT
Latest Stories