దావోస్ వెళ్ళినా శనీశ్వరం తప్పదా…

Chandrababu Davos Visit

ఎప్పటిలాగే ఈ నెల 19 నుంచి 22 వరకు దావోస్‌లో ప్రపంచ ఆర్ధిక సదస్సు జరుగబోతోంది. దీనిలో పాల్గొనేందుకు సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో సహా మరికొందరు మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు దావోస్ బయలుదేరి వెళుతున్నారు. అక్కడ వివిధ దేశాలకు చెందిన మంత్రులు, అధికారులు, పారిశ్రామికవేత్తలతో వారు సమావేశమవుతారు.

గత ఏడాది దావోస్ పర్యటనలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బృందం లక్షల కోట్లు పెట్టుబడులు సాధించుకుంది. కానీ సిఎం చంద్రబాబు నాయుడు బృందం దావోస్‌ సదస్సులో ఎంవోయూలు చేసుకున్న ఫోటోలు ఒక్కటి కూడా పెట్టలేదు. పెట్టుబడుల గురించి ప్రభుత్వం ఎటువంటి ప్రకటనా చేయలేదు.

ADVERTISEMENT

వారి బృందం భిన్నమైన వ్యూహంతో ఆ విధంగా వ్యవహరించిందని గ్రహించని వైసీపీ, చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి పెట్టుబడి కూడా సాధించలేకపోయారని ఎద్దేవా చేసింది. కానీ ఆ తర్వాత వరుసపెట్టి అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏపీకి తరలివచ్చాయి! లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు, డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. విశాఖలో ఏర్పాటవుతున్న గూగుల్ డేటా సెంటర్ కూడా వాటిలో ఒకటి.

దావోస్ పర్యటన శుద్ధ దండగ అని విమర్శించిన వైసీపీకి అప్పుడు అర్థమైంది తాము తొందరపడి నోరు జారామని! కనుక అది కూడా మాట మార్చి ఆ కంపెనీలన్నీ తమ హయంలోఎంవోయూలు చేసుకున్నవేనంటూ వాటి క్రెడిట్ కోసం ఆరాటపడి మరోసారి నవ్వులపాలైంది.

సిఎం చంద్రబాబు నాయుడుకి అంతర్జాతీయంగా ఉన్న ఇమేజ్, పరపతి, పరిచయాల గురించి అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తీ దావోస్ సదస్సు నుంచి ఒక్క రూపాయి పెట్టుబడి సాధించలేకపోయారని వైసీపీ ఎలా నమ్మేసిందో?

దావోస్ సదస్సు లక్ష్యం రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించడం. కానీ రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదన్నట్లు అక్కడకు వెళ్ళినా ఓ పక్క పెట్టుబడుల కోసం గట్టిగానే ప్రయత్నిస్తూనే మరోపక్క వైసీపీ చేయబోయే నీచ రాజకీయాల గురించి కూడా ఆలోచించి తగిన వ్యూహాలతో ముందుకు సాగాల్సి వస్తుండటం బాధాకరమే కదా?

ADVERTISEMENT
Latest Stories