
ఈరోజు శాసనసభ సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “మంత్రులు అందరూ తాము చేపట్టిన శాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, రాష్ట్రాభివృద్ధికి సిఎం చంద్రబాబు నాయుడు కన్న కలలను నిజం చేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేస్తాము.
Also Read – తప్పు దిద్దుకునే బాధ్యత లేదా.?
అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం ఈ రాష్ట్రానికి, మా అందరికీ చాలా అవసరం. ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు కాదు… మరో 10 ఏళ్ళు కొనసాగాలని నేను కోరుకొంటున్నాను. ఆయన మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుకొంటున్నాను,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఓ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీల నేతలకు ముఖ్యమంత్రి పట్ల, ఆయన నిర్ణయాలు, ఆలోచనలు, విధానాల పట్ల సదాభిప్రాయమే ఉంటుందని అనుకోవడం రాజకీయ అజ్ఞానమే. కానీ శాసనసభ సమావేశాలలో జనసేన, బీజేపీ సభ్యుల ప్రసంగాలు విన్నట్లయితే అందరికీ సిఎం చంద్రబాబు నాయుడు పట్ల పూర్తి నమ్మకం ఉందని స్పష్టం అవుతుంది.
Also Read – వైసీపీ కి ఆ అర్హత ఉందా.? కానీ జనసేన బాధ్యత..!
జగన్, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారి సొంత పార్టీ నేతలే వారి నిర్ణయాలతో విభేదించేవారు. కానీ అధినేతకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయేవారు. కానీ ఆ పార్టీలని వీడి బయటకు వచ్చిన ప్రతీ ఒక్కరూ కేసీఆర్, జగన్ ధోరణి, ఆలోచనలు, విధానాలు అన్నీ తప్పని చెప్పేవారు. అంటే అదే వారి అసలైన అభిప్రాయం అన్న మాట!
ఇటీవల పవన్ కళ్యాణ్ రాష్ట్ర హోంమంత్రిని, పోలీస్ శాఖని విమర్శిస్తూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసినప్పుడు కూటమి ప్రభుత్వంలో బీటలు మొదలయ్యాయని, ప్రభుత్వంలో రెండు సమాంతర శక్తులు (చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్) అధికారులు లిగిపోతున్నారని,” అంటూ కొందరు ఎద్దేవా చేశారు.
Also Read – చిలుకూరు పరామర్శ పోటీలు… అందుకేనా?
కానీ అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరో పదేళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. సిఎం చంద్రబాబు నాయుడి ఆలోచనా విధానం, అనుభవం రెండూ అద్భుతంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ మెచ్చుకోవడం ఏదో రొటీన్ పొగడ్తగా తీసి పారేయలేము. ఆయన మాటలు విన్నట్లయితే మనస్ఫూర్తిగా అన్నట్లే అర్దమవుతుంది.
అలాగని పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఇదే అభిప్రాయంతో ఉంటారని అనుకుంటే అది రాజకీయ అవివేకమే. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వాముల మద్య చక్కటి వాతావరణం నెలకొని ఉందని మాత్రం స్పష్టమవుతోంది. కనుక వాకూటమిలో చిచ్చు పెట్టేందుకు జగన్ ప్రయత్నించకపోవడమే వైసీపికి ఆయనకీ చాలా మంచిది.
Pawan Kalyan‘s Interesting Comments On Chandrababu Naidu
చంద్రబాబు గారు వచ్చే ఐదేళ్లు కాదు పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి
"చంద్రబాబు విజన్‌కు తగ్గట్టు పనిచేస్తాం
సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు గారు సీఎంగా ఉండాలి"#TDPJanasena pic.twitter.com/jBlwDkUJib— M9 NEWS (@M9News_) November 20, 2024