ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని శాసనసభలోనే చాలా దారుణంగా అవమానించారు. ఆయన కుమారుడు నారా లోకేష్‌ని చాలా అవహేళన చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే ఆయన సతీమణి భువనేశ్వరి గురించి చాలా అనుచితంగా మాట్లాడారు.
నాడు జగన్ పాలనలో ఇన్ని అవమానాలకు గురైన వారు ముగ్గురూ నేడు సమాజంలో అత్యున్నతమైన గౌరవ మర్యాదలు, పురస్కారాలు పొందుతున్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం నిర్మాణ పనులు, రాష్ట్రాభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన, టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటే జగన్ రప్పారప్పా రాజకీయాలు చేస్తున్నారు.
జగన్ కుటుంబం పరిస్థితి ఇలా ఉంటే, సిఎం చంద్రబాబు నాయుడు కుటుంబం ఆత్మీయత, అనురాగాలతో బలంగా ముడిపడి ఉందని ప్రజలు కూడా అర్ధం చేసుకోగలుగుతున్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ అధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, “నేను కాగితం మీద వ్రాసుకొచ్చి మాట్లాడుతుంటే ఆమె ట్యాబ్ చూసి మాట్లాడుతున్నారు. నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటే ఆమె టెక్నాలజీ వాడుతున్నారు,” అంటూ ప్రశంసించారు.
ఓ బహిరంగ సభలో భార్యని ఉద్దేశ్యించి సిఎం చంద్రబాబు నాయుడు ఇంత గొప్పగా చెప్పుకుంటుంటే, జగన్ ఏం చేస్తున్నారు?తన తల్లి, చెల్లితోనే ఆస్తుల కోసం పోరాటాలు చేస్తున్నారు. సొంత చెల్లెలు సైతం ఆయనని వేలెత్తి చూపి విమర్శిస్తోంది కదా?
కుటుంబంలో సమస్యలను పరిష్కరించుకోలేని వారు సమాజాన్ని ఎలా ఉద్దరిస్తారు?కుటుంబంతో బలమైన బంధం లేనివారు పార్టీతో, సమాజంతో సరిగ్గా వ్యవహరిస్తారని ఎలా ఆశించగలం? ఈ రప్పారప్పాలు ఇందుకు నిదర్శనం కావా?
నేను టెక్నాలజీ గురించి ఇంతగా మాట్లాడినా టెక్నాలజీ వినియోగంలో మాత్రం భువనేశ్వరి కంటే వెనుకబడే ఉన్నాను. తనకు వాళ్ళ నాన్న ఎన్టీఆర్ మాదిరిగా పట్టుదల, మొండితనం ఎక్కువ.#NTRTrust #ChandrababuNaidu #NaraBhuvaneswari pic.twitter.com/jxiGbHVJDg
— Icon News (@IconNews247) December 28, 2025




