వాల్ ఆఫ్ ఇండియా నుండి వాయిస్ ఆఫ్ ఇండియా..

cheteshwar pujara

గడిచిన దశాబ్దంగా ‘మోడరన్ వాల్ ఆఫ్ ఇండియా’ గా గుర్తింపు పొందిన భారత టెస్ట్ బ్యాటర్ చిటేశ్వర్ పుజారా, తన టెస్ట్ బ్యాటింగ్ ఫామ్ లేమితో గత సంవత్సరం జూన్ నుండి భారత జట్టు కు దూరమయ్యారు.

అనేకానేక సమయాల్లో, ఎన్నో సార్లు తన డిఫెన్సివ్ బ్యాటింగ్ తో జట్టుకు వెన్నుముకలా, బ్యాటర్లకు చేయూత అందించి మంచి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పారు. అయితే, వచ్చే వారం నుండి మొదలయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పుజారా కెరీర్లోనే ఒక అద్భుతమైన మెయిల్ స్టోన్ గా నిలిచిపోయింది.

ADVERTISEMENT

ఆ బోర్డర్-గవాస్కర్ సిరీస్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలిచారు పుజారా. 2033 పరుగులతో విరాట్ కోహ్లీ కంటే అగ్ర స్థానంలో ఉన్నారు పుజారా. పోయినసారి బీ.జీ.టీ కోసం ఆస్ట్రేలియాకి పర్యటించినప్పుడు పుజారా చూపిన పోరాట పటిమ తన కెరీర్ కే హైలైట్ గా నిలుస్తుంది.

అయితే, అంతటి స్థాయి కలిగిన స్పెషలిస్ట్ టెస్ట్ బ్యాటర్ పుజారా గతేడాది జూన్ లో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తన ఆఖరి టెస్ట్ గా నిలిచింది. తాజాగా, న్యూజీలాండ్ తో ఘోర ఓటమి తరువాత బీ.జీ.టీ లో ఖచ్చితంగా పుజారా ను ఎంపిక చేస్తారనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది.

అయితే ఈ బీ.జీ.టీ లో టీం ఇండియా బ్యాట్స్ మాన్ గా మైదానంలో అడుగుపెట్టాల్సిన పుజారా, హిందీ భాష కు కామెంటేటర్ గా రంగ ప్రవేశం చేస్తున్నారు దీనితో అప్పుడు వాల్ ఆఫ్ ఇండియా గా ఉన్నవాడు ఇప్పుడు వాయిస్ ఆఫ్ ఇండియా గా మారిపోయారా అంటూ పుజారా అభిమానులు ఆయన కమ్ బ్యాక్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

గతంలో కూడా దినేష్ కార్తీక్ సైతం కామెంటేటర్ గా మారిన తరువాత పట్టుదలతో తిరిగి జట్టు లో తిరిగి స్థానం దక్కించుకున్నారు. ఇప్పుడు పుజారా కూడా అదే తరహాలో టీం ఇండియా టెస్ట్ జట్టులో తన స్థానాన్ని తిరిగి సుస్థిరం చేసుకోవాలంటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories