‘అమ్మ’ చనిపోయే నాటికి రెండు ‘కాళ్ళు’ లేవా?

chief-minister-jayalalithaa-death-mysteryదివంగత ముఖ్యమంత్రి జయలలిత కాలం చేసిన తర్వాత వెలుగుచూస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అనేక రకాల వార్తలు వినిపిస్తుండగా, తాజాగా ఓ సంచలనాత్మకమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. జయలలిత మరణించే నాటికి ఆమెకు రెండు కాళ్ళు లేవన్న సంగతి సోషల్ అండ్ వెబ్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అపోలోలో చికిత్స ఇస్తున్న సమయంలో జయలలితకు షుగర్ ఎక్కువైన నేపధ్యంలో… ఆమె రెండు కాళ్ళను తీయడం వైద్యులకు అనివార్యం అయ్యిందని ప్రచారం జరుగుతోంది.

ఈ కారణంగానే చికిత్స జరుగుతున్న సమయంలో జయలలితను చూడడానికి ఎవరినీ అనుమతించలేదన్న వాదన బలపడుతోంది. అలాగే జయలలిత పార్థీవదేహాన్ని పూర్తి స్థాయిలో చూపించకుండా జాతీయ జెండా కప్పడం వెనుక ఆంతర్యం కూడా ఇదేనని ప్రచారం జరుగుతోంది. ఈ వాదనలకు బలాన్ని చేకూర్చే అంశం ఏమిటంటే… జయలలితకు షుగర్ చికిత్స నిమిత్తం వైద్యం చేస్తున్నామని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఒకానొక సమయంలో చెప్పడం గమనించదగ్గ విషయం.

ADVERTISEMENT

ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో గానీ, ఇలా ‘అమ్మ’పై వస్తున్న రోజుకొక వార్త అభిమానులను కలవరపరుస్తోంది. అయితే 75 రోజుల పాటు అత్యంత సీక్రెట్ గా సాగిన వైద్యమే ఇలాంటి పుకార్ల లాంటి వార్తలను ప్రజలు నమ్మేలా చేస్తోంది. ఒక్క చిన్న ఫోటో గానీ, వీడియో గానీ బయటకు రాకుండా జయలలితకు జరిపిన వైద్యం అనేక మిలియన్ డాలర్ల ప్రశ్నలను ప్రజలకు కానుకగా ఇచ్చిందని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT
Latest Stories