మెగాస్టార్ కి కేశినేని సూచన… మరి చిరు చొరవ తీసుకుంటారా.?

Chiranjeevi and AP leaders discussing Nandi Awards and film industry development in Andhra Pradesh

గత నెల ఉగాది రోజున తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ ప్రోత్సాహం కోసం గద్దర్ అవార్డులను అందించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి, ఆర్ నారాయణ మూర్తి వంటి వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ కోసం నంది అవార్డులను అందించాలంటూ డిమాండ్ చేసారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమ ను ప్రోత్సహించడంలో కాస్త వెనుకబడిందని, వారు కూడా రేవంత్ సర్కార్ మాదిరి ఏపీ ప్రభుత్వం నుంచి నంది అవార్డులు ప్రకటిస్తే బాగుంటుందంటూ సభా వేదిక మీద కూటమి సర్కార్ కి ఒక సూచన చేసారు.

ADVERTISEMENT

అయితే చిరు ప్రకటన పై భిన్న వాదనే బయటకొచ్చినప్పటికీ ఆ విషయంలో రెండురోజులు మీడియాలో, సోషల్ మీడియాలో హడావుడితో వివాదం సద్దుమణిగింది. తాజగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నంది అవార్డుల ప్రకటన త్వరలోనే ఉంటుందంటూ ప్రకటిస్తూ మెగాస్టార్ చిరుకి తమ ప్రభుత్వం నుంచి ఒక సూచన చేసారు.

గత వైసీపీ ప్రభుత్వం తమ 5 ఐదేళ్ల సమయంలో సినీ పరిశ్రమను చాల ఇబ్బంది పెట్టిందని, అలాగే సినీ పరిశ్రమ ప్రముఖులను అవమానించిందని కానీ తాము చిత్ర పరిశ్రమను, ఆ పరిశ్రమకు సంబంధించిన నటీనటులను ఎంతగానో గౌరవిస్తామని, ఏపీ ప్రభుత్వం తరుపున కూడా సినీ పరిశ్రమకు నంది అవార్డులు త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

సినీ పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగమయ్యేలా ఇక్కడ స్టూడియో ల నిర్మాణాలు చేపట్టాలని, అలాగే మూవీ షూటింగ్స్ కి కూడా ఏపీలో చాల అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని ఈ దిశగా పరిశ్రమ పెద్దలు అడుగులు వేయాలంటూ అందుకు చిరు చొరవ చూపాలని సూచించారు కేశినేని చిన్ని.

టాలీవుడ్ కు దాదాపు 65% ఆదాయం ఒక్క ఏపీ నుంచే అందుతుందని, కనీసం మూవీ షూటింగ్ లో 25% అయినా ఏపీలో షూటింగ్స్ జరిపితే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే అందుకు టాలీవుడ్ కి అవసరమైన అన్ని వసతులు, అనుమతులు కూడా అందిస్తూ చిత్ర పరిశ్రమ ప్రోత్సాహకానికి పూర్తి సహకరిస్తామంటూ చెప్పుకొచ్చారు చిన్ని.

అయితే నాడు తమ చిత్ర పరిశ్రమ కోసం కూటమి ప్రభుత్వం పై గొంతెత్తిన ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు అదే ప్రభుత్వం ఇస్తున్న సూచనలను పరిగణలోకి తీసుకుంటారా.? ఆంధ్రప్రదేశ్ లో స్టూడియోల నిర్మాణానికి అడుగులు ముందుకు వేస్తారా.?

ఏపీలో మూవీ షూటింగ్స్ కి మక్కువ చూపుతారా.? లేదా కేవలం ఏపీని టాలీవుడ్ కి ఒక ఆదాయ వనరుగానే భావించి సినీమా విడుదలకు ముందు టిక్కెట్ రేట్లు పెంచితే చాలు, ఏడాదికొకసారి ప్రభుత్వం నుంచి అవ్రాదుల రూపంలో ప్రోత్సాహకాలు అందిస్తే చాలు అంటూ ఎప్పటి మాదిరిగానే గమ్మునుంటారా.?

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టిక్కెట్ రేట్ల తగ్గింపుతో నాటి ముఖ్యంమత్రి జగన్ మోహన్ రెడ్డి కి భయపడి ఇండస్ట్రీ పెద్దలందరూ చిరు సమక్షంలో తాడేపల్లి జగన్ ప్యాలస్ కి తరగాలి వచ్చారు, అవమానభారంతో తిరిగి వెళ్లారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము మీ పరిశ్రమకు సహరిస్తాం మహా ప్రభో అంటూ అడిగిన సినిమాకల్లా అడిగినంత టిక్కెట్ రేట్లు పెంచుతున్నా,

వారికీ ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు రాకుండా చూస్తున్నా ఇండస్ట్రీ ప్రముఖులు ఇప్పటికి బాబు ప్రభుత్వం పై తమ మాటలతో ఏదోరకంగా రాళ్ళూ రువ్వుతూనే ఉంటున్నారు. టాలీవుడ్, ప్రభుత్వం నుంచి తమకు కావాల్సింది అడిగి తీసుకునేటప్పుడు ప్రభుత్వం కోరుకుంటున్నది కూడా ఇండస్ట్రీ తిరిగి ఇవ్వాలిగా.? మరి అందుకు చిరు చొరవ చూపిస్తారా.?

ADVERTISEMENT
Latest Stories