ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దలు. అయితే.. చిరంజీవి విషయంలో మాత్రం ఆ ఆలస్యం అనేది అమృతంగా మారింది. మేటర్ ఏంటంటే.. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా “ముఠా మేస్త్రి” రీమాస్టర్డ్ వెర్షన్ ను రీరిలీజ్ చేద్దామనుకున్నారు. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఆఖరి నిమిషంలో ఆ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసారు.
సినిమా అలా పోస్ట్ పోన్ అవ్వడం చిరంజీవికి భీభత్సమైన మేలు చేసింది. ఎందుకంటే.. 21న “ఇరుముడి” రిలీజ్ అయ్యి, 22న “ముఠా మేస్త్రి” రీరిలీజ్ అయ్యి, తెలుగు రాష్ట్రాల్లో “ముఠా మేస్త్రి” కోసం గనుక థియేటర్స్ రెండు రోజులు హోల్డ్ చేసి ఉంటే ఇమేజ్ పరంగా చిరంజీవికి చాలా డ్యామేజ్ అయ్యుండేది.
ఎందుకంటే.. ఇరుముడికి వచ్చిన హిట్ స్టేటస్ కి రేపు రిలీజ్ అవుతున్న టాక్సిక్ కి థియేటర్లు షేర్ చేస్తుంటేనే సోషల్ మీడియా మొత్తం దిల్ రాజు మీద దుమ్మెత్తిపోస్తోంది. అలాంటిది ముఠా మేస్త్రి అది కూడా చిరంజీవి పుట్టినరోజు అని చెప్పి రిలీజ్ చేసి థియేటర్స్ ను హోల్డ్ చేయడం అనేది హాస్యాస్పదంగా మారేది.
అసలే సోషల్ మీడియాలో బాస్ అనే పేరుతో జరుగుతున్న ట్రోలింగ్ చూస్తూనే ఉన్నాం. ఈ రీరిలీజ్ జరిగి, రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఒక 50 థియేటర్లు హోల్డ్ లోకి వెళ్లినా రచ్చ రచ్చ అయ్యేది. ఆ ట్రోలింగ్ కి ఈ రీరిలీజ్ ఆజ్యం పోసేది. ఆ విధంగా ముఠా మేస్త్రి టెక్నికల్ ఇష్యూస్ కారణంగా పోస్ట్ పోన్ అవ్వడం అనేది అనుకోకుండానే చిరంజీవికి చాలా మంచి చేసింది.





