చిరంజీవి సమక్షంలో మోహన్ బాబుకు ‘నవరస నట తిలకం’

chiranjeevi-mohan-babu75 ఏళ్ళ తెలుగు సినీ వజ్రోత్సవాల సమయంలో ‘లెజెండ్’ పేరుతో మోహన్ బాబు – చిరంజీవిల మధ్య సాగిన రసవత్తర సన్నివేశాలను బహుశా ఏ తెలుగు సినీ అభిమాని కూడా మరువకపోవచ్చు. అప్పటినుండి బయటపడ్డ విభేదాలు ఏదొక రూపేణా ప్రేక్షకులను సందడి చేస్తూనే ఉన్నాయి. అలాగే చిరంజీవికి ‘పద్మభూషణ్’ వచ్చిన సమయంలో కూడా మోహన్ బాబు – పవన్ కళ్యాణ్ ల మధ్య జరిగిన ‘ఉదంతం’ కూడా వీక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను పంచిన సంగతి తెలిసిందే.

ఇలా పలు సందర్భాలలో తనకు రావాల్సిన గుర్తింపు రాకపోవడంపై, పలు విధాలుగా అసంతృప్తి ప్రకటించిన మోహన్ బాబుకు తాజాగా ‘నవరస నట తిలకం’ బిరుదుతో సత్కరించనున్నారు టి.సుబ్బిరామిరెడ్డి. విశాఖపట్టణం, టీఎస్సార్ లలిత్ కళా పరిషత్ ఆధ్వర్యంలో మునిసిపల్ స్టేడియంలో ఈ నెల 17న జరగబోతున్న వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వంటి హేమాహేమీలు తరలిరానున్నారు. అలాగే అలనాటి అందాల బొమ్మ ‘అతిలోకసుందరి’ శ్రీదేవితో పాటు జయసుధ వంటి తారామణులు కూడా హాజరు కానున్నారు.

ADVERTISEMENT

అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి – మోహన్ బాబులకు జరిగిన ఉదంతాల రీత్యా, చిరు సమక్షంలోనే మోహన్ బాబు ఈ బిరుదు అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఈ వేడుకలో ఎలాంటి సంచలన ప్రకటనలు వెలువడతాయోనని సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బహిరంగ వేడుకలపై తనంతట తానూగా చిరు ఎలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయరన్న నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉండడంతో, ‘కలెక్షన్ కింగ్’ ప్రసంగం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories