స్వచ్ఛ భారత్ తో పాటుగా స్వచ్ఛ రాజకీయాలు అవసరమే…

Clean politics for a better India

2014 అక్టోబర్ – 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ అనే జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. పరిశుభ్రతకు, పచ్చదనానికి చిహ్నంగా మోడీ ఇచ్చిన ఈ నినాదమే నేడు భారత్ లో అనేక కీలక మార్పులకు నాంది పలికింది.

అయితే స్వచ్ఛ భారత్…పరిశుభ్రమైన భారతం దేశానికో ఎంత అవసరమో నేటి సమాజానికి స్వచ్ఛ రాజకీయాలు కూడా అంతే అవసరంగా మారిపోయాయి. రాజకీయాల పేరుతో నిత్యం ఒకరి మీద మరొకరు అసత్య ప్రచారాలతో బురద జల్లుకోవడం, సోషల్ మీడియాలో దిగజారుడు పోస్టులతో పైశాచిక ఆనందాన్ని పొందడం,

ADVERTISEMENT

రాజకీయ విమర్శల పేరిట వ్యక్తిగత జీవితాలను బజారుకు లాగడం, రాజకీయాలకు సంబంధం లేని మహిళలను రాజకీయ వేదికలెక్కించడం, పార్టీ మద్దతుదారుల ముసుగులో ప్రత్యర్థి పార్టీల నేతల పై తప్పుడు కథనాలు ప్రచారం చేయడం వంటి అస్వచ్ఛ రాజకీయాలు నడుస్తున్నాయి.

ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడాలేదు. కానీ వాటిలో ఉండే రేషియో మాత్రమే ఇక్కడ ప్రామాణికంగా మారిపోయింది అంటే నేటి సమాజంలో రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోతున్నాయో ఇట్టే అర్ధమవుతుంది. కులాల ప్రాతిపదికన, మతాల చాటున, ప్రాంతాల పేరుతో ఇలా రాజకీయాలకు కాదేది అనర్హం అన్నట్టుగా నేటి సమకాలీన రాజకీయ పార్టీలు ఈ అస్వచ్ఛ రాజకీయాల వైపు మొగ్గుచూపుతున్నాయి.

ఇటువంటి రాజకీయాలను చూస్తూ భవిష్యత్ లో రాజకీయ రంగం వైపు యువత అడుగులువేసే పరిస్థితి ఉంటుందా.? ఉన్నా భవిష్యత్ తరం రాజకీయ నేతలు కూడా ఇటువంటి రాజకీయాలనే ఆదర్శంగా తీసుకుంటే ఇక రాజకీయాలలో సత్యానికి, ధర్మానికి, న్యాయానికి, స్వచ్ఛతకు చోటుంటుందా.?

అయితే రాజకీయాలలో కూడా స్వచ్ఛత తెచ్చేలా ఎదో ఒక రాజకీయ పార్టీ కానీ, ఎవరో ఒక రాజకీయ నాయకుడు కానీ ముందడుగేసి ఈ స్వచ్ఛ పాలిటిక్స్ నినాదం ఎత్తుకుని దాన్ని సమాజంలోకి బలంగా తీసుకెళ్లగలిగితే భారతదేశ రాజకీయ ముఖ చిత్రం లో కూడా మార్పు ఆశించవచ్చేమో…!

ADVERTISEMENT
Latest Stories