వీరి కలియిక వారికెప్పుడు కంటతడేనా.?

Chandrababu and Pawan Kalyan meeting

కూటమి పొత్తులో భాగమైన టీడీపీ, జనసేన అధినేతలు తమ రాజకీయ బంధానికి మించి అనుబంధంగా ముందుకెళుతున్నారు. ఒకరి కష్టంలో మరొకరు చేయూతగా నిలుస్తున్నారు, ఒకరి ఆనందమో మరొకరు భాగస్వాములుగా మెలుగుతున్నారు.

అయితే ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ చిచ్చు కోసం, ఈ ఇద్దరు పార్టీల అధినేతల మధ్య వ్యక్తిగత వైరాలు కోసం గత కొన్నేళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వైసీపీ శ్రేణులకు ఎప్పుడు నిరాశే ఎదురవుతుంది. వారి కలయికలు వీరికెప్పుడు కంటతడినే మిగులుస్తున్నాయి.

ADVERTISEMENT

పవన్ – బాబు మధ్య రాజకీయ ఆధిపత్యం సృష్టించేందుకు కమ్మ వారి కోసం పవన్ కాపు వారి ఆత్మగౌరవాన్ని బలిచేస్తున్నారు అంటూ వైసీపీ ఇద్దరి వ్యక్తులను వేరు చేసేందుకు రెండు కులాల ప్రాతిపదికన రెచ్చకొట్టే రాజకీయం నడిపిస్తుంది. అయినా కూడా ఈ ఇద్దరు ఎప్పుడు వైసీపీ కుల రాజకీయాల ట్రాప్ లో పడలేదు, తమ పార్టీ శ్రేణులను పడనివ్వలేదు.

ఇక ఇన్నాళ్లు బాబు పల్లకి ఇక రేపటి రోజున లోకేష్ పల్లకి మోసేందుకు జనసైనికులు సిద్ధం కండి అంటూ లోకేష్, పవన్ టార్గెట్ గా వైసీపీ రాజకీయం సాగించింది. కూటమి 2.0 అధికారంలోకి వస్తే ఈ సారి లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడంటా పవన్ ను తక్కువ చేసే ప్రయత్నం చేసి పవన్ అభిమానులను, జనసేన క్యాడర్ ని జెండా కూలీలు అంటూ అవహేళన చేసింది.

అయినా కూడా ఈ ఇద్దరు తోడబుట్టిన అన్నదమ్ముల మాదిరి సమయం చిక్కినప్పుడల్లా, సందర్భం కుదిరినప్పుడల్లా తమ మధ్య పెనవేసుకున్న అనుబంధాన్ని ప్రదర్శిస్తూనే వస్తున్నారు. తాజాగా పవన్ కు ముంబై లో జరిగిన భుజం ఆపరేషన్ కై పవన్ ను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు ముంబై వెళ్లారు.

ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, తన అనారోగ్యం పూర్తిగా మెరుగుపడేవరకు రాజకీయ కార్యక్రమాలకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించి విశ్రాంతి తీసుకోవాలంటూ సలహాలు సూచనలు ఇచ్చొచ్చారు బాబు. ఇక నేడు మంత్రి లోకేష్ సైతం పవన్ పరామర్శ కోసం హైద్రాబాద్ లో ఆయన స్వగృహానికి వెళ్లారు.

పవన్ ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీసి పూర్తి ఆరోగ్యంగా తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని కోరుకుంటూ విజయవాడ దుర్గమ్మ చిత్ర పాఠాన్ని కానుకగా ఇచ్చారు. అయితే పవన్ – లోకేష్ ఆత్మీయం గా కౌగిలించుకుని ఉన్న ఫోటోలను, వారిద్దరూ కలిసి ముచ్చటించుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీనితో వీరిద్దరి కలియిక ఎప్పుడు వారి కళ్ళల్లో కన్నీటికి కారణమవుతాయి అంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశించి టీడీపీ, జనసేన క్యాడర్ కామెంట్ చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories